CM Jagan: సీఎం జగన్ చేస్తున్న అతిపెద్ద తప్పు తెలిస్తే షాకవ్వాల్సిందే!

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు ఎప్పుడో కసరత్తులు మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా అన్ని నియోజకవర్గాలలో తమ పార్టీ గెలుపొందాలన్న లక్ష్యంతో ఈయన తన పార్టీ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్లాలని సూచిస్తున్నారు.వివిధ రకాల పథకాల పేరిట ఎమ్మెల్యేలను ప్రజలలోకి పంపి తమ పాలన పట్ల ప్రజాధరణ ఎలా ఉందో పర్యవేక్షించాలని తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు వారికి అందుతున్నాయా లేదా జగన్ పరిపాలన ఎలా ఉంది అనే విషయం గురించి ఆరా తీస్తున్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తమకు ఏమాత్రం పడటం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండడంతో జగన్ అలాంటి ఎమ్మెల్యేలకు తన స్టైల్ లో వార్నింగ్ కూడా ఇచ్చారు.

 

ప్రజా సేవ చేసే వారికి మాత్రమే తదుపరి ఎన్నికలలో అవకాశాలు ఉంటాయని అనంతరం మరో మాట లేదంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు అదేవిధంగా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అన్న విషయం గురించి జగన్ ఐపాక్ ప్రతినిధులతో సమావేశం అయ్యి ఎమ్మెల్యేల పనితీరు గురించి చర్చించి అనంతరం వారికి టికెట్ ఇవ్వాల వద్ద అన్న తుది నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొందరు జగన్ ఇలా ఐపాక్ ప్రతినిధులను నమ్ముకుని టికెట్లు ఖరారు చేయడం ఏమాత్రం సబబు కాదని ఇందుకు ప్రత్యామ్నాయంగా మరొక సంస్థను కూడా నియమించి ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు.

 

ఎందుకంటే ఐ ప్యాక్ ప్రతినిధులను ఎవరిని నియమించారనే విషయం సదరు ఎమ్మెల్యేలకు తెలుసు దీంతో ఆ ఎమ్మెల్యేలు తమ సేవల పట్ల మంచిగా స్పందించడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్నా ఐపాక్ ప్రతినిధులనే పెద్ద ఎత్తున ప్రసన్నం చేసుకుంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున పార్టీకి నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. అందుకే జగన్ ఈ విషయంలో మరొక నిర్ణయం కూడా తీసుకోవాలని కొందరు భావిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -