CM Jagan: సీఎం జగన్ పోలింగ్ స్ట్రాటజీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

CM Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటన వెళ్తూ ఉన్నారు. అయితే గతంలో ఈయన ఢిల్లీ పర్యటనకు వెళితే నిధుల కోసం వెళ్లారని లేకపోతే అవినాష్ కేసు గురించి కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకోవడం కోసం ఢిల్లీ వెళ్తున్నారు అంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు కురిపించారు. అయితే ప్రస్తుతం అవినాష్ భయం ఎలాగో లేదు అదే విధంగా నిధులు కూడా పుష్కలంగా లభిస్తున్నాయి. అయినప్పటికీ జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారన్న విషయం అందరిలోనూ తలెత్తుతుంది.

ఈ క్రమంలోని సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్లడానికి మరే కారణం లేదని ఒకవైపు నారా లోకేష్ పాదయాత్ర మరోవైపు పవన్ కళ్యాణ్ ద్వారా యాత్ర చేస్తున్న నేపథ్యంలో వారికి ఎక్కువగా మద్దతు లభిస్తుందని అందుకే ముందస్తు ఎన్నికలు జరపడం కోసమే కేంద్రం కాళ్లు పట్టుకోవడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్న మాటలివి. కానీ జగన్ రాజకీయ స్ట్రాటజీ వేరే ఉందని తెలుస్తుంది.

 

జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లడానికి మరే కారణం లేదు వచ్చే ఎన్నికలు ఒకేసారి కాకుండా దశలవారీగా నిర్వహిస్తే ఎన్నికల మేనేజ్మెంట్ కి కూడా ఎంతో సులభతరంగా ఉంటుందని ఈయన ఇలా ఎన్నికలను దశలవారీగా నిర్వహించడం కోసమే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. ఈ విధంగా ఎన్నికలను కొన్ని దశల వారీగా జరపటం వల్ల మంచి విజయాన్ని అందుకోవచ్చు అన్న వ్యూహాన్ని జగన్ రక్షిస్తున్నట్లు సమాచారం.

 

అయితే ఏపీలో 175 స్థానాలలో ఎన్నికలు జరగనున్నాయి ఇలా ఇన్ని దశలవారీగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఒప్పుకోదు. అందుకే ఈయన కేంద్రం అనుమతి తీసుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తుంది. ఇలా దశలవారీగా ఎన్నికల నిర్వహించాలి అంటే ఆ రాష్ట్రంలో ఏదైనా రాజకీయ సమస్యలు మావోయిస్టు నేపథ్యం ఉంటేనే ఇలా భద్రత కోసం దశలవారీగా ఎన్నికలను నిర్వహిస్తారు కానీ ఏపీలో అలాంటి పరిస్థితులు లేవు కనుక ఎన్నికల సంఘం ఒకేసారి ఎన్నికల నిర్వహించడానికి సిద్ధమవుతుందే తప్ప దశలవారీగా నిర్వహించడానికి అంగీకరించకపోవచ్చన్న అనుమానంతోనే జగన్ కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తోంది. మరి ఇందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -