Allu Arjun: అల్లు అర్జున్ హీరో కావడానికి ఎన్ని అవమానాలు అనుభవించాడో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Allu Arjun: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన పుష్ప సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక తాజాగా 69వ జాతీయ అవార్డుల ప్రధాన ఉత్సవంలో భాగంగా అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా జాతీయ నటుడిగా అవార్డు అందుకున్నటువంటి ఈయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇకపోతే అల్లు అర్జున్ కి ఈ స్థాయిలో ఆదరణ రావడం వెనుక ఎంతో కష్టం అవమానాలు కూడా ఉన్నాయని చెప్పాలి. అల్లు అర్జున్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలలో భాగంగా చిన్నప్పుడు వేదికపై డాన్స్ చేశారట అయితే ఈయన డాన్స్ గమనించిన రాఘవేంద్రరావు అల్లు అర్జున్ తల్లి గారి వద్దకు వెళ్లి ఆమె చేతిలో వంద రూపాయలు పెట్టి పెద్దయ్యాక మీ కొడుకు కచ్చితంగా హీరో అవుతాడు నేనే చేస్తానని చెప్పి వెళ్లారట.

 

అల్లు అర్జున్ డాన్స్ చేయడంతో రాఘవేంద్రరావు తనకు వంద రూపాయలు ఇచ్చారు. అయితే ఇప్పటికీ ఆ 100 రూపాయలు అల్లు అర్జున్ అలాగే దాచుకున్నారట. ఇక ఆయన చెప్పిన విధంగానే రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఇండస్ట్రీకి గంగోత్రి సినిమా ద్వారా పరిచయమై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా సమయంలో అల్లు అర్జున్ లుక్స్ గురించి ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడుతూ హేళన చేశారు.

 

ఇలా గంగోత్రి సినిమా విడుదలైన తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నటువంటి అల్లు అర్జున్ ఇండస్ట్రీకి దూరం కాకుండా తనను తానే నిరూపించుకోవడం కోసం ఆర్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా అందరిని తన ప్రేమలో పడేసుకున్నారు ఇంతలా ఈయన తన కెరియర్లో ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకుంటూ ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ హీరోగా జాతీయ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -