Nani: దసరాకు నాని పారితోషికం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

Nani: నాచురల్ స్టార్ నాని విభిన్న కథ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో నాని మొదటిసారి డి గ్లామర్ పాత్ర ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు. స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెలా అనే నూతన దర్శకుడు పని చేయగా సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ మరోసారి సందడి చేశారు.

 

ఈ సినిమా మార్చి 30వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాపై భారీ అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశం కోసమే కేవలం ఐదు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను రెండు ఓటీటీ సంస్థలు కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలకు సంబంధించిన హక్కులను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేయగా… హిందీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేశారు. ఇక ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకున్నటువంటి 8 వారాలకు ఓటీటీలో విడుదల చేసేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.

 

ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఈ సినిమా కోసం నాని తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైనటువంటి నాని ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం నాని ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా నాని సినీ కెరియర్ లో ఇదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది.ఇలా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -