First Interview: ఫస్ట్ ఇంటర్వ్యూలో బాలయ్య చెప్పిన ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

First Interview: ఎన్టీఆర్ నట వారసుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి తిరుగులేని నటసింహంగా రూపాంతరం చెందిన నటుడు నందమూరి బాలకృష్ణ ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయం చేయవలసిన అవసరం లేదు. తండ్రి పోలికలతో పాటు తండ్రి లక్షణాలను కూడా పుణికిపుచ్చుకొని టాప్ హీరోగా ఎదిగాడు బాలకృష్ణ. నట సింహం గా నందమూరి అభిమానుల మన్ననలు పొందుతూ ఈ వయసులో కూడా బిజీగా ఉన్నాడు బాలయ్య.

రీసెంట్ గా వీరసింహారెడ్డి సినిమాతో హిట్ కొట్టిన బాలకృష్ణ ఇప్పుడు ఫ్యామిలీతో సహా అమెరికాలో నాటా వేడుకలలో పాల్గొంటూ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వెకేషన్ కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చిన వెంటనే ఆయన భగవద్ కేసరి సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారు ఈ సినిమా పూర్తిగా వెంటనే బాబి దర్శకత్వంలో తన 19వ సినిమా చేస్తాడు. అలా ఇటు రాజకీయాలతో అటు సినిమాలతో ఈ వయసులో కూడా బిజీ బిజీగా గడుపుతున్నాడు బాలకృష్ణ.

 

అయితే ఇప్పుడు బాలకృష్ణని చూస్తున్న ప్రేక్షకులకి సినిమాల్లోకి వచ్చిన మొదట్లో ఎలా ఉండేవాడు అన్నా ఉత్సాహం ఉండి తీరుతుంది. అయితే అలాంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఈ మధ్యనే నందమూరి బాలకృష్ణ తాను హీరో అయ్యాక ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ పత్రిక పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అది ఏ పేపర్ లోదో ఇప్పటివరకు తెలియలేదు ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో ఏముందంటే తాను ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని నటుడిగా ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకోవాలని ఉందని..

 

తనకి తండ్రి పోలికలు వచ్చినంత మాత్రాన తండ్రిలాగే చూడవలసిన అవసరం లేదని తనలో కూడా విభిన్నమైన నటుడు ఉన్నాడని సమయం వచ్చినప్పుడు బయట పడుతుందని ఆ రోజుల్లోనే చెప్పాడు బాలకృష్ణ. ఇప్పుడు ఆ న్యూస్ పేపర్ ఇంటర్వ్యూ తెగ వైరల్ అవుతుంది. అయితే ఇది బాలకృష్ణ వరకు వెళ్లిందా.. వెళ్తే అతని రియాక్షన్ ఏమిటో చూడాలి మరి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -