Chiranjeevi: చిరంజీవి పెద్ద కూతురు చేస్తున్న ఈ పని తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల గురించి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమే నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే సుస్మిత నిర్మాతగా ఎప్పటికైనా తన తండ్రితో కలిసి ఒక సినిమా చేయాలనేదే ఆమె కోరిక. ఈ క్రమంలోనే తన కూతురి కోసం చిరంజీవి ఏకంగా ఒక సినిమాని సెట్ చేసి పెట్టారు. చిరంజీవి హీరోగా మూడు అద్భుతమైన హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.

ఇప్పటివరకు ఈయన దర్శకత్వంలో చిరంజీవి నటించిన మూడు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ సినిమాలుమంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందన్న నమ్మకం అందరిలోనూ ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు నిర్మాతగా తన కుమార్తె సుస్మితను వ్యవహరించాలని తెలియజేశారు. అదేవిధంగా మరొక నిర్మాణ సంస్థ చిరంజీవి సుస్మిత ముందు ఒక మంచి ప్రపోజల్ పెట్టారు. ఈ సినిమా పెట్టుబడి మొత్తం తామే భరిస్తామని లాభాలలో తమకు వాటా ఇవ్వాలని అడిగారట.

 

ఇలా పెట్టుబడి పెట్టి తమ బ్యానర్ పక్కన తమ బ్యానర్ పేరును కూడా చేర్చాలని చెప్పడంతో చిరంజీవికి ఈ డీలింగ్ నచ్చడంతో తన కుమార్తెకు ఈ డీల్ ఒప్పుకోవాలని సూచించారట. అయితే సుస్మిత మాత్రం తన తండ్రి మాట వినడం లేదని తెలుస్తోంది.ఎక్కడ లాభనష్టాలు వాటాలు మాత్రమే కాదు తనకు ఎప్పటినుంచో తన తండ్రితో కలిసి సోలోగా ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించడమే తన లక్ష్యమని తెలియజేశారు.

 

ఇలా తన తండ్రితో ఒక్క సినిమా అయినా చేయాలని తన కోరిక నెరవేరాలి అంటే ఈ సినిమాని సొంతంగా తానే నిర్మించాలని సుస్మిత తెలియజేశారు. అయితే ఈ విషయంలో మాత్రం చిరంజీవి సుస్మితను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ విషయంలో సుస్మిత తన తండ్రి మాటను వింటుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -