Sharmila: ఆ విషయంలో షర్మిలే టాప్ షర్మిలే తోపు.. ఏం జరిగిందంటే?

Sharmila: వైఎస్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అలాగే వైఎస్ షర్మిల గురించి మనందరికీ తెలిసిందే. వీరిలో ఒకరు ప్రస్తుతం విపజిత ఆంధ్రకు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తుండగా మరొకరు కాంగ్రేస్ ను నిలబెట్టి దాని ద్వారా ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని తొలి అడుగు వేశారు. వైఎస్ కుటుంబంలో వ్యక్తుల మధ్య పద్ధతులు పెద్దగా తేడా లేకున్నా, ఎవరి ప్రత్యేకత వారికుంది. ఇంకా ఈ అన్నాచెల్లెళ్లు కూడా 2019 వరకు మాటతీరు, పనితీరు ఒకే రకంగా వుండేవారు. కానీ ఏమయ్యిందో ఏమో గానీ మధ్యలో షర్మిల అన్నను వదలి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకుని, ఎన్నికల ముందు కాంగ్రెస్ కు మద్దతు తెలిపి పోటీ నుండి తప్పుకుంది.

 

చివరకు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆంధ్ర పిసిసి అధ్యక్ష పదవి చేపట్టింది. వైయస్ కుటుంబం మత పరంగా క్రైస్తవాన్ని ఆచరిస్తారని ప్రపంచం అంతా తెలుసు. వైఎస్ కుటుంబానికి అధికారం వచ్చిన మూడు సందర్భాలలో వాళ్లు ప్రభుత్వ ఖర్చుతో జెరూసలేం దర్శనం చేసుకుని మరీ వచ్చారు. అలాగే వైయస్ కుటుంబంలో మత భోదకులు కూడా ఉన్నారు. వైఎస్ కుటుంబం అధికారంలో ఉంటే మతమార్పిడిలు అధికంగా జరుగుతాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ జగన్ విజయానికి వస్తే.. జగన్ ఏ కారణం చేతనో తన మతం విషయంలో కూడా గోప్యత పాటిస్తారు. తిరుమలలో అక్కడి నిబంధనలు పాటించి, వారి విశ్వాసాలను గౌరవించి అన్యమతస్థుల డిక్లరేషన్ ఇవ్వలేదు.

 

దానిమీద అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చి, చివరకు అది కోర్టులకు ఎక్కినా ఆయన ప్రజల డబ్బుతో కోర్టుల్లో వాదనలు వినిపించారే గానీ తన మతం ఏమిటో చెప్పి ఈ చర్చను ఆపలేదు. నిజానికి మతం వ్యక్తిగతం, చట్టపరంగా ఎవరికి నచ్చిన మతాన్ని వారు ఆచరించే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది. అలాగే తెలుగు రాజకీయాల్లో మతానికి పెద్ద ప్రాముఖ్యత ఉండదు. అయినా భాద్యతాయుత స్థానంలో ఉన్న జగన్ ఈ విషయంలో అత్యంత గోప్యత పాటిస్తారు. బహుశా ఓట్ల కోసం కావచ్చు అన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గుడిలోకి వెళతారు కానీ ఏనాడు తన సతీమణి ఆయన వెంటరారు. ప్రసాదం తిన్నట్టు ఫొటోలు వస్తాయి తప్ప తింటారో లేదో తెలియదు. అలాగే క్రైస్తవ సమాజానికి తను చేయగలిగినవన్నీ చేస్తారు, చివరికి 25 పార్లమెంట్ నియోజకవర్గాలున్న ఆంధ్రాలో క్రైస్తవ నమ్మకాలను అనుసరించి 26 జిల్లాలు చేసెంత నమ్మకం కానీ తాను క్రైస్తవుడిని ఎక్కడా చెప్పుకోలేని భయం. మరి షర్మిల విషయానికి వస్తే.. ఆమె భర్త అనిల్ కుమార్ పేరుపొందిన మతబోధకుడు. వాళ్లు కలిసి అనేక ప్రార్థనలు, కూటమి సభల్లో పాల్గొన్న వీడియోలు ఇంటర్నెట్లో కూడా అందుబాటులో వున్నాయి.

 

ఆమె గత రెండు సంవత్సరాలుగా తెలంగాణలో సొంత పార్టీ పెట్టి అధికారం కోసం ప్రయత్నించింది. కాంగ్రెస్లో విలీనం చేస్తూ ఒక క్రైస్తవరాలుగా మణిపూర్ ఘటనలను చూసి చలించి కాంగ్రెస్ లో కలుస్తున్నానని ధైర్యంగా చెప్పింది. ఆంధ్ర పీసీసీ అధ్యక్షురాలిగా భాద్యతలు చేపట్టే క్రమంలో మరొక్కసారి తను క్రైస్తవరాలు అని నొక్కి చెప్పింది. షర్మిల కూడా రాజకీయాలే చేస్తుంది, ఏమో గుర్రం ఎగరావచ్చు, అదృష్టం బాగుంటే నవ్విన నాపచేను పండవచ్చు అని తన అదృష్టం ఆంధ్రాలో పరీక్షించుకుంటుంది. తనకీ ప్రజల ఓట్లు కావాలి, కానీ తను తన గుర్తింపు చెప్పుకోవడానికి భయపడలేదు, ధైర్యంగా ఒకటికి రెండు సార్లు చెప్పింది. నిజానికి రెండు దశాబ్ధాల క్రితమే వైఎస్ ను అంగీకరించినప్పుడే ప్రజలు వాళ్ల కుటుంబ మత విశ్వాసాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారు, కానీ జగన్ రెడ్డి ఇలా భయంగా, అటు క్రైస్తవులను, ఇటు హిందువులను మభ్యపెడుతూ ఇలా ఎన్నిరోజులు రాజకీయాలు చేస్తారో. ఈ విషయంలో తనకంటే చిన్నదైన చెల్లెలు షర్మిలను అనుసరించి తన నమ్మకాలను చెప్పే ధైర్యం కూడదీసుకోగలిగితే ప్రజల్లో అనవవసర చర్చను ముగించినవారు అవుతారు జగన్. ఈ విషయంలో షర్మిల ధైర్యానికి మెచ్చుకోవచ్చు. అంతేకాకుండా ఆమె ధైర్యానికి ఎవరు సాటిదారు అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -