Raajadhani Files: ఆ మూవీ ట్రైలర్ లో బాబాయ్ గొడ్డలి ఎపిసోడ్.. ఏం జరిగిందంటే?

Raajadhani Files: రాజకీయ అంశాలతో సినిమా తీసి సంచలనం సృష్టించాలంటే ఆర్జీవీ తరువాతే ఎవరైనా. గత ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒక సినిమా తీశారు. లక్ష్మీపార్వతీ కోణంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను అందులో చూపించారు. గత ఎన్నికలకు ముందు అదో పెద్ద సంచలనం. 2019 ఎన్నికలు తర్వాత కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ మరో సినిమా తీశారు. బలమైన టీడీపీ ప్రాంతాల్లో కూడా కడప రెడ్లు.. అంటే వైసీపీ పాగా వేసినట్టు చూపించారు. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వకపోయినా.. పెద్దగా చర్చకు దారి తీశాయి. ఆర్జీవీ కోరుకునేది కూడా అదే. సినిమా రిజల్ట్ కంటే.. ఆ సినిమాతో తన పేరు ఎంత వైరల్ అయింది అనేదే ఆయనకు కావాలి. ఇప్పుడు వ్యూహం పేరు ఏపీ సీఎం జగన్ జీవిత చరిత్రను తీశారు. అయితే, ఇప్పుడు అది న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రిలీజ్ కు చాలా అడ్డంకులు ఫేస్ చేస్తోంది. అయితే.. ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి చినిపోవడం.. జగన్ ఓదార్పు యాత్ర, ఆ తర్వాత జైలుకు వెళ్లడం.. 2019లో అధికారంలోకి రావడం వంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. కానీ, విడుదలకు ఆ సినిమా నోచుకోవడం లేదు.

 

అయితే, ఇంతలోనే ఏపీ రాజకీయాలను షేక్ చేసే మరో సినిమా విడుదలకు సిద్దమవుతోంది. అదే రాజధాని ఫైల్స్. ఏపీ రాజధాని అమరావతిని ప్రస్తుత ప్రభుత్వం ఎలా తొక్కు పెట్టింది అనే యాంగిల్ ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొద్ది సేపటికే మంచి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో చాలా కీలకమైన ఎపిసోడ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. మూడు రాజధానుల పేరుతో వైసీసీ ప్రభుత్వం అమరావతి రైతులకు చాలా అన్యాయం చేసిందని ఈ సినిమాలో స్పష్టం చూపిస్తున్నారు. అంతేకాదు.. రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం ఎలా అణచివేసే ప్రయత్నం చేసిందో ట్రైలర్ లో ఉంది. ఇక 140 కోట్ల మంది ఉన్న దేశానికి ఒక రాజధాని.. ఆరు కోట్లమంది ఉన్న రాష్ట్రానికి నాలుగు రాజధానులు అవసరమా? అని యువరైతు ప్రశ్నిస్తున్న సీన్ సినిమాకు హైలట్ అయ్యే ఛాన్స్ ఉంది. పరదాలు కట్టుకొని సీఎం.. రైతులకు ముఖం చాటేస్తున్నట్టు కూడా చాలా క్లియర్ గా చూపించారు. ఇక, గుడివాడలో క్యాసినోల నిర్వాహణ కూడా సినిమాలో హైలట్ అయ్యే అవకాశం ఉంది.

రైతుల ఉద్యమాలకు ప్రభుత్వం తలొగ్గకపోవడంతో.. వారు చేసిన మహాపాదయాత్రను కూడా సినిమాలో హైలట్ చేశారు. ప్రభుత్వ పరిపాలన తీరును కూడా సినిమాలో చూపించారు. ప్రజలను కష్టపడండని చెప్పకూడదు. సంక్షేమపథకాలతో మన చుట్టూ తిప్పుకోవాలని చెప్పిన సీన్ ఎన్నికల ముందు రాజకీయాలను గట్టిగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక బాబాయ్ గొడ్డలి ఎపిసోడ్ కూడా చూపించారు. అయితే, ఈ సీన్ ఎలా పెట్టారు అనేది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ సీనియర్ నటుడు వినోద్ కుమార్ చేస్తున్నారు. టీవీ5 మూర్తి కూడా ఓ రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ఏపీ రాజకీయాలను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. భాను డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఈనెల 15న రిలీజ్ అవుతుంది. మణిశర్మ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. మరోవైపు ఈ నెల 9న యాత్ర2 విడుదల కానుంది. దానికి కౌంటర్‌గా ఈ సినిమా వస్తుంది. ఇందులో ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతుందో? ఏ సినిమా బ్యాలెట్ బాక్స్ దగ్గర హిట్ అవుతుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -