Sharmila: షర్మిల విషయంలో దాడి వెనుక ఏకంగా ఇన్ని లెక్కలున్నాయా?

Sharmila: కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు సహజం. వాటిని ఎంత సామరస్యంగా పరిష్కరించుకుంటే అంత మంచిది. వీధిన పడితే నష్టం జరిగేది ఆ కుటుంబ సభ్యులకే తప్పా బయటవారికి కాదు. ఒకవేళ సమస్య పరిస్కారం కాకపోతే.. ఎవరిదారి వాళ్లు చూసుకోవాలే తప్పా.. ఒకరి జీవితం మరొకరు వేళ్లు పెట్టకూడదు. కానీ.. షర్మిల విషయంలో జగన్ చేస్తున్న తప్పు అదే. గడప దాటకుంటా క్లియర్ చేసుకోవాల్సిన వివాదాలను ఢిల్లీ నడిబొడ్డన నిలబెట్టారు. షర్మిలతో జగన్ కు ఆస్థి వివాదాలు క్లియర్ కాలేదు కనుక వీలైంత జాగ్రత్తగా ఉండాలి. కానీ, షర్మిలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే.. జరిగే నష్టం జగన్‌కే ఉంటుంది. ఏకంగా వీరిద్దరి విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. షర్మిలకు అండగా నేనుంటా.. వైసీసీ నేతల దాడిని ఖండిస్తున్నా.. సోషల్ మీడియాలో ఇలాంటి దాడులు ఆపకపోతే బాగోదు అని రాహుల్ గాంధీ షర్మిల కోసం స్పందించారు. రాజకీయాల కోసం ఓ మహిళను పైగా చెల్లిని ఇలా మానసికంగా హింసించడం సరికాదని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో పిరికిపంద చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. షర్మిలది వైఎస్ రక్తం కాదని.. వైఎస్ ఫ్యామిలీతో షర్మిలకు సంబంధం లేదని వైసీపీ సోషల్ మీడియాలో రాస్తున్నవార్తలపై ఆయన స్పందించారు.

 

దీనిపై షర్మిల కూడా ఘాటుగా స్పందించారు. ఓటమిని ఎదుర్కోలేక పిరికివాళ్లు మాత్రమే క్రూరత్వాన్ని ఆశ్రయిస్తారని మండిపడ్డారు. ఏపీ ప్రజల మద్దతు ఉన్నంత వరకూ ఇలాంటి బెదిరింపులకు బయపడనని షర్మిల చెప్పారు. రాహుల్ గాంధీ, షర్మిల కౌంటర్లకు వైసీపీ సోషల్ మీడియా వెనక్కి తగ్గుతుందని ఎవరూ అనుకోరు. కానీ, జగన్ ఎందుకు ఇంత దారుణంగా తయారైయ్యారు అనేదే ప్రధాన ప్రశ్న. ప్రతిపక్షాలను ఎదుర్కోవాలి అంటే వారి కుటుంబ సభ్యులపైనా, వారిపైనా వ్యక్తిగత దూషణులు, వ్యక్తిత్వహననానికి పాల్పడతారు. కానీ, అదే రాజకీయాల కోసం సొంత చెల్లెలపై కూడా ఇలాగే చేస్తారా?

ఇక్కడ ఇంకో విషయాన్ని అర్థం చేసుకోవాలి. షర్మల తన స్పీచ్‌లో ప్రత్యేక హోదా, విభజన హామీల గురించే మాట్లాడుతున్నారు తప్పా.. జగన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదు. జగన్‌ను వ్యతిరేకించి ఎందుకు కాంగ్రెస్‌లో చేరారని వైసీపీ కార్యకర్తలు అడిగిన ఓ ప్రశ్నకు.. జగన్ అన్న అంటే నాకు కూడా ఇష్టమే.. కానీ, ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ లో చేరారని చాలా హుందాగా సమాధానం చెప్పారు షర్మిల. ఇంత వరకూ ఎక్కడా పాలసీలు తప్ప వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లలేదు. కానీ.. వైసీపీ సోషల్ మీడియా అదేపనిగా షర్మిలపై వ్యక్తిగత దూషణలు చేస్తోంది. అంతేకాదు.. నాది కూడా వైఎస్ రక్తమే అని చెప్పుకునే దుస్తితి షర్మిలకు జగన్ తీసుకొని వచ్చారంటే ఏమనుకోవాలి? నాది కూడా వైఎస్ ఫ్యామిలీనే.. నాది కూడా వైఎస్ రక్తమే అని చెబుతున్నారనంటే.. అది జగన్ కు మాత్రం అవమానం కాదా? ఓ సారి జగన్ ఆలోచించుకోవాలి. ఆలోచించడం మానేసి అన్నా చెల్లెల వివాదాన్ని జాతీయ సమస్యగా మార్చుకుంటే.. అది వారికే నష్టం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -