Amit Shah: అమిత్ షా చేసిన ప్రకటనలో న్యాయముందా.. ఇవేం మాటలంటూ?

Amit Shah: దేశవ్యాప్తంగా తమ పార్టీని అన్ని రాష్ట్రాలలోనూ బలోపేతం చేసుకోవడానికి బీజేపీ ప్రభుత్వం శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో ఈసారి తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే తెలంగాణలో బీజేపీ బలపడిందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చే అంత బలం లేదని మాత్రం చెప్పవచ్చు.

ఇకపోతే తాజాగా చేవెళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.ఈ సభలో అమిత్ షా మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.

ఇలా ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామంటూ అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ ఎంతవరకు సమంజసం అని పలువురు భావిస్తున్నారు.ముస్లింలకు ప్రస్తుతం నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే అవి ముస్లింలకు రిజర్వేషన్లు అని చెప్పినప్పటికీ చాలా ఆర్థికంగా వెనుకబడిన ఉప కులాలకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ముస్లింలకు ఉన్నటువంటి ఈ నాలుగు శాతం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామంటూ హామీ ఇచ్చారు.

 

అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ ముస్లిం రిజర్వేషన్ల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే మునుగోడు ఉప ఎన్నికల ముందు ఎస్సే రిజర్వేషన్ల గురించి జీవో ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ముస్లింలకు మాత్రం జీవో ప్రకటించలేదు. ఈ వివాదాల హైలెట్ అయ్యే అవకాశం ఉండటంతో ఎన్నికల అంశం చేసేందుకు అమిత్ షా రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ బహిరంగ సభలో ముస్లిం రిజర్వేషన్ల రద్దును ప్రకటించారు. ఈ విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -