AP: ఏపీ మరో బీహార్ అవుతోందా.. అసలేం జరిగిందంటే?

AP: ఒకప్పుడు మర్డర్లకి, కిడ్నాప్ లకి పేరు మోసిన రాష్ట్రంగా బీహార్ ఉండేది. కానీ ఇప్పుడు విశాఖపట్నం కూడా నేనేమీ తక్కువ కాదంటూ కిడ్నాప్ లకి, మర్డర్లకి తనదైన పేరు సంపాదించుకుంటుంది. అందుకు ఉదాహరణ తాజాగా విశాఖలో సంచలనం రేపిన ఎంపీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్.

ఇంతకీ ఏం జరిగిందంటే ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇల్లు ఋషికొండలో ఉంది ఆయన మాత్రం వ్యవహారాల నిమిత్తం హైదరాబాదులో ఉంటారు. భార్య పిల్లలు ఇక్కడ ఉంటారు. ఉదయం ఋషికొండలోని ఎంపీ ఇంట్లోకి కిడ్నాపర్లు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ల ఫ్యామిలీకి సన్నిహితుడు, ఆడిటర్ అయిన వైఎస్ఆర్సిపి నేత గన్నమనేని వెంకటేశ్వరరావు ని కూడా పిలిపించి ఆయనని కూడా కిడ్నాప్ చేశారు.

అయితే ఈరోజు ( జూన్ 15) ఎంపీపీ సత్యనారాయణ జివికి ఫోన్ చేయడంతో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో సత్యనారాయణ పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు ఆయన ఫోన్ ని ట్రాక్ చేయడంతో పద్మనాభం వైపు వెళుతున్నట్లు తెలుసుకున్నారు.

వెంటనే ముగ్గురు డిసిపిలతో 15 బృందాలుగా విడిపోయి గాలించడంతో ఎనిమిది గంటలలోనే బాధితులని కిడ్నాపర్ల చెర నుంచి రక్షించారు. ఈ కేసులో నలుగురు దుండగులు ఉన్నట్లు తెలిపింది కిడ్నాపర్లలో ప్రధానమైన వాడు హేమంత్ గా పోలీసులు గుర్తించారు. హేమంత్ పై ఇప్పటికే రెండు కిడ్నాప్ కేసులు ఒక మర్డర్ కేసు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కిడ్నాప్ ద్వారా 50 కోట్లు హేమంత్ డిమాండ్ చేసినట్లు సమాచారం.

హేమంత్ తరచుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులతో గొడవ పడుతూ ఉంటాడు. అందువల్ల ఈ కిడ్నాప్ జరగగానే ఇందులో హేమంత్ పాత్ర ఉండొచ్చని అనుమానం తోనే ఈ కేసుని త్వరగా చేదించారని సమాచారం. విషయం తెలుసుకున్న విశాఖ వాసులు విశాఖ లో ఇంత ఘోర పరిస్థితులు నెలకొన్నాయా అంటూ వాపోయారు. ఎంపీ కుటుంబానికి దిక్కులేదు ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి.. ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ అవుతుందా అంటూ కలవర పడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -