Chandrababu: గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి తీసుకుని చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా.. ఏం జరిగిందంటే?

Chandrababu: చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ విషయంలో సుదీర్ఘ వాదనలు, వాయిదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంగా అసలు చర్చలో కూడా లేకుండా పిటిషన్ చెల్లదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టులో ఇప్పటికీ వాదనలు జరుగుతున్నాయి. అయితే వచ్చే నెలలో ఈ పిటిషన్ పై సుప్రీం తీర్పు ఇవ్వనుంది. దీని గురించి ఉండవెల్లి అరుణ్ మాట్లాడుతూ 67 ఏ ప్రకారం చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదన్న సాంకేతిక కారణాన్ని చూపుతూ చంద్రబాబుకి అనుగుణంగా తీర్పు వచ్చినా, ఆ తర్వాత గవర్నర్ అనుమతి తీసుకుని వెంటనే అరెస్టు చేస్తే ఏం చేస్తారు అంటూ ప్రశ్న ఒకటి అందించారు.

గవర్నర్ అనుమతి అనే ఒకే ఒక సాంకేతిక కారణాన్ని పట్టుకొని కేసులన్నీ కొట్టేయించుకొని బయటికి వస్తాను అంటున్నారు చంద్రబాబు. అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి చంద్రబాబు శుద్ధి పూస అయిపోవాలన్నమాట. తను శుద్ధి పూస అయిపోయి బయటికి వచ్చినట్లుగా చెప్పుకోవడానికి చంద్రబాబు ఆరాటపడుతున్నట్లు ఉన్నారు. అయితే చంద్రబాబు చెప్పిన సాంకేతిక కారణాలకి, ఈ స్కామ్ కి ఏ మాత్రం సంబంధం లేదు.

ఒకవేళ ఇదే కారణంగా చూపించి చంద్రబాబు నాయుడు బయటికి వచ్చినా ఆ మచ్చ అలాగే మిగిలిపోతుంది. అయితే ఇలాంటి మచ్చలేవి చంద్రబాబుకి కొత్త ఏమీ కాదు చాలా కేసుల్లో ఆయన స్టే లు తెచ్చుకున్నారు. ఆయన సిబిఎన్ కాదు స్టేబీఎన్ అని చాలామంది ఎద్దేవా చేస్తూ ఉంటారు. అయితే ఈ కేసులో పలు కారణాలవల్ల ఆయన బయటికి వచ్చినా మరోవైపు ప్రభుత్వం మరిన్ని పీటీ వారెంట్లతో రెడీగా ఉంది. చంద్రబాబు నాయుడు ఇలా దీర్ఘకాలం జైల్లో ఉండడం తెలుగుదేశం పార్టీ శ్రేణులను నిరశపరిచే అంశమే.

ఇన్నాళ్లుగా చంద్రబాబులో కనుసన్నలలో పార్టీ నడిచింది. ఇప్పుడు వారసుడు వయసు పెరిగినా చంద్రబాబుకి ఆసరాగా నిలబడలేక పోతున్నాడు. ఇప్పుడు వారసుడికి తోడుగా నారా భువనేశ్వరి కూడా రంగంలోకి దిగారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఇప్పుడప్పుడే బయటికి వస్తారనే వాతావరణం కనిపించడం లేదు. ఇదే కంటిన్యూ అయితే తెలుగుదేశం వచ్చే ఎన్నికలను ఎలా ఫేస్ చేస్తుందో చూడాల్సిందే మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -