Akira: అకిరా కోసం చరణ్ అలాంటి త్యాగం చేస్తున్నారా?

Akira: మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోలు వెండితెరపై మంచి స్టార్ హోదాను దక్కించుకుంటున్నారు. వాళ్లు పర్సనల్గా ఫ్యామిలీ లైఫ్ కి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు అన్న విషయం అందరికీ తెలిసింది. హీరోగా ఎంత హోదా తెచ్చుకున్నప్పటికీ కుటుంబ పరంగా బ్రదర్ బాండింగ్ అనేది వాళ్ళ మధ్య చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పండగ అయినా పబ్బమైనా మెగా కుటుంబం మొత్తం కలిసే జరుపుకోవాలని ఇప్పటికీ వాళ్ళ ఆచారం. వాళ్ల మధ్య సంబంధం బాంధవ్యాలు చాలా బలంగా ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమే.

 

బయట ఎటువంటి రూమర్స్ వచ్చినప్పటికీ కుటుంబ పరంగా వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు అనేది సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టే పోస్టులను బట్టి తెలుస్తుంది. మెగా కుటుంబానికి పెద్ద కొడుకు మరియు మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్ తన స్టార్ ఇమేజ్ తో పాటు మరొకవైపు ఆ ఇంటి పెద్ద అన్న బాధ్యతను కూడా భుజాన వేసుకున్నాడని సమాచారం. రామ్ చరణ్ కి తన బాబాయి పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ స్నేహితుల కలిసి మెలిసి ఉంటారు.

 

ఇటు పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకిరా నందన్ కూడా తన అన్న రామ్ చరణ్ తో చాలా క్లోజ్ గా ఉంటాడు. అయితే అకిరా నందన్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ పెట్టిన ప్రత్యేకమైన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

అకిరా నందన్ ఇప్పుడు తన 18 బర్త్డే జరుపుకుంటున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ అభిమానుల్లో అకిరా నందన్ హాట్ టాపిక్ గా ఉన్నాడు. అతని టాలీవుడ్ ఎంట్రీ కోసం పవర్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇంకా అతని సినీ రంగ ప్రవేశం పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరోపక్క అకిరా నందన్ కు మెగా ఫ్యామిలీతో బాండింగ్ తక్కువ అన్న పుకార్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు మెగా బ్రదర్స్ కు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు వచ్చిన వాటిల్లో అఖీరా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. కేవలం ఫ్యామిలీ ఈవెంట్స్ కు తప్ప అకీరా మిగతా సందర్భాలలో ఈ బ్రదర్స్ మధ్య కనిపించిన దాఖలా లేదు.

 

ఈ నేపథ్యంలో అకిరా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో తన తమ్ముడితో ఉన్న అనుబంధం గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు.’ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ తన తమ్ముడితో అనుబంధం మరింత బలపడుతోంది అని అతన్ని అమితంగా ప్రేమిస్తున్నాను అని రాంచరణ్ పేర్కొన్నారు. అంతేకాకుండా అకిరా సినిమా కెరియర్ కు సంబంధించిన అన్ని బాధ్యతలు తనే స్వయంగా చూసుకుంటానని చరణ్ పవన్ కుమార్ ఇచ్చాడు అని సన్నిహితుల సమాచారం. అతను అవసరమైతే తన తమ్ముడి కోసం ప్రాణాలైనా ఇస్తాను అన్నాడని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -