Sushmitha: చిరంజీవికి పెద్ద కూతురు శనిలా దాపురించిందా.. ఆమె పని చేస్తే సినిమా ఫ్లాపేనా?

Sushmitha: మెగాస్టార్ చిరజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి చిరంజీవి గతంలో మాదిరి ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు. ఇక చిరంజీవి రీ ఎంట్రీ తరువాత సైరా నరసింహారెడ్డి సినిమా నుంచి మొదలుకొని చిరంజీవికి సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.

ఇలా చిరంజీవి సినిమాలన్నింటికీ తన పెద్ద కుమార్తె సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో సుస్మిత పట్ల కూడా భారీగానే ట్రోల్స్ వస్తున్నాయి. ఈమె చిరంజీవికి తన వయసుకు తగ్గ కాస్ట్యూమ్స్ ఇవ్వడం లేదని అంతేకాకుండా చాలా ఓల్డ్ మోడల్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు అంటూ చాలా విమర్శలు వెళ్ళు వెతుకుతున్నాయి.

 

ఇలా సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించినటువంటి చిరంజీవి సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవడంతో సుస్మిత పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాజాగా వచ్చినటువంటి భోళాశంకర్ సినిమా విషయంలో కూడా ఈమె గురించి విమర్శలు వచ్చాయి. ఈ సినిమాలో చిరంజీవి కాస్ట్యూమ్స్ మాత్రం బాగాలేవని 70 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి రజనీకాంత్ జైలర్ సినిమాలో చాలా స్టైలిష్ గా ఉన్నారని, చిరంజీవికి మాత్రం ఓల్డ్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారంటూ విమర్శలు చేశారు.

 

ఈ క్రమంలోని సుస్మిత చిరంజీవి సినిమాలకు ఐరన్ లెగ్గుగా మారిందని ఈమె సినిమాలకు పని చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈమె తన తమ్ముడు రామ్ చరణ్ కి కూడా రంగస్థలం సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఈ సినిమా మాత్రం చాలా మంచి సక్సెస్ అందుకుంది.ఇకపోతే చిరంజీవి తదుపరి సినిమాలో నుంచి సుస్మిత తప్పుకుంటే బాగుంటుందని కొందరు ఈమె పట్ల చేస్తున్నటువంటి విమర్శలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -