Cm Jagan: సీఎం జగన్ ఇంత బలవంతుడా.. ఈ విషయాలు తెలుసా?

Cm Jagan: తాజాగా సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ..
జగన్ బలవంతుడు. అందుకే ఆయన బలహీన వర్గాలకు వెన్ను తట్టి తోడు నిలుస్తున్నారు. అందరూ హామీలు ఇస్తారు అది నిజమే. అలాగే మాటలు కూడా చెబుతారు. కానీ చేతలకు వచ్చేసరికి చేతులు రావు. నీరు కారిపోతారు అని చెప్పుకొచ్చారు ప్రసాదరావు.. కానీ ఆ విషయానికి వచ్చేసరికి జగన్ మోహన్ రెడ్డి దానికి పూర్తిగా భిన్నం అని, సామాజిక న్యాయం అన్న అందమైన నినాదాన్ని పెదవుల మీదే కాకుండా పదవుల మీద రాసి బలహీనులను తెచ్చి సమున్నతమైన ఆసనమంలో కూర్చోబెడుతున్నారు.

రాజ్యసభ సీట్లు అంటే పెత్తందారులకు కార్పోరేట్లకు అన్న కల్చర్ ని మార్చింది జగనే అని మనసా వాచా అంతా అంగీకరిస్తారు.ఎమ్మెల్సీ పదవులు సైతం అక్షరాలా పెద్దలకే అన్న రాజకీయ నానుడిని మార్చి పరిస్థితిని మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. అందుకే జగన్ బలవంతుడు అని అంతా ఒప్పుకుంటారు. కాగా రాజకీయ సంకల్పంతో పాటు సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటేనే తప్ప ఇది సాధ్యపడదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఏడున్నర పదుల దేశ చరిత్రలోనే ప్రధమం అని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. జగన్ గట్స్ కి జోహార్ అనాల్సిందే అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

 

శాసనమండలిలో కొత్తగా కొలువు తీరిన వైసీపీ ఎమ్మెల్సీలలో అత్యధికులు బలహీన వర్గాలకు చెందిన వారే. వారి ప్రమాణ స్వీకారా ఘట్టానికి హాజరైన ధర్మనా ఈ కీలక కమెంట్స్ చేశారు. జగన్ వంటి నేతను ఇంతకు ముందు చూసి ఉండరని,ఇక మీదట చూస్తారో లేదో అని తెలిపారు ప్రసాదరావు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చూసుకున్నా బీసీలకు మహిళలకు పెద్ద పీట జగన్ వేసి ఎమ్మెల్సీలుగా కూర్చోబెట్టారు. ఏపీలోని అనేక జిల్లాలలో ఇదే పరిస్థితి ఉంది. అందుకే ధర్మాన లాంటి వారు చెప్పే ధర్మమేంటి అంటే జగన్ని కాపాడుకోవాలి. ఆయన వైపే జనాలు ఉండాలనీ అన్నీ తెలిసిన ప్రజలు ఈ విషయంలో విలక్షణమైన తీర్పు తమకు అనుకూలంగా ఇస్తారని వైసీపీ ఆశాభావంగా ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -