YCP: వైసీపీ దారుణమైన పరిస్థితికి సీఎం జగన్ చేసిన తప్పిదాలే కారణమా?

YCP: అసలే అసమ్మతి రాగాలతో గుంటూరు జిల్లా వైసీపీ అట్టుడుకుతుంటే కునుకుతున్న నక్క మీద తాటిపండు పడినట్టు వైసీపీకి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు షాక్ ఇచ్చారు. పలు ఆరోపణలు చేస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగుతూందా అంటే కాదనే సమాధానం వినిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు బాటలోనే మరికొంత మంది పల్నాడు నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని గుంటూరు సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. అంతేకాదు వైసీపీలో కీలకంగా ఉన్న ముస్లిం నేత ఒకరు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అటు, పల్నాడు జిల్లాలో ఓ ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ కూడా ఎంపీ దారిలోనే వెళ్తారని ప్రచారం జరుగుతోంది. జగన్ ఒట్టెద్దు పోకడలే పార్టీని ముంచుతాయని అసంతృప్తులు లోలోపల గుసగుసలాడుతున్నారు. ఐదేళ్లలో ఎమ్మెల్యేలకు ఎలాంటి పవర్స్ ఇవ్వకుండా.. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉందని అభ్యర్థులను మార్చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లుగా ఏ ఒక్కపని కూడా ఎమ్మెల్యేల చేతుల మీదుగా జరగలేదని.. జగన్ బటన్ నొక్కి తనపని తాను చేసుకుంటూ పోయాడని విమర్శిస్తున్నారు. ఐదేళ్లుగా ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే నియోజవర్గం మారినా.. ఎమ్మెల్యేల ఓటమిని జగన్ ఆపలేరని అనుకుంటున్నారు. దీంతో.. దీపం ఉండగానే ఇల్లు అలుక్కవోడం మంచిదని.. అవకాశం ఉన్న పార్టీలో చేరిపోవడానికి అసమ్మతి నేతలు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

 

అయితే, ఈ నేతలంతా ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో టీడీపీ లేదా జనసేనలో చేరాలని కొందరు భావిస్తున్నారట. అయితే, ఆ రెండు పార్టీలు పొత్తులో ఉండటంతో అక్కడ ఉన్నవాళ్లలో కొందరికి టికెట్లు వస్తాయనే గ్యారెంటీ లేదు కనుక.. కొత్తగా మనం చేరినా ఉపయోగం ఉండదని అనుకుంటున్నారట. దీంతో.. కాంగ్రెస్ లో చేరితే.. పార్టీ బలపడిన రోజు మంచి భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నారట. అయితే, ఏ పార్టీలో చేరాలి అనేదానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ బీణీ కొడుతుందా? లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -