NTR: ఎన్టీఆర్ వేడుక కంటే దేవర షూటింగ్ ఎక్కువైందా.. విమర్శలు చేసేవాళ్లకు అసలు జవాబిదే!

NTR: తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి.ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగినప్పటికీ జాతీయస్థాయిలో మాత్రం ఇప్పటివరకు ఏది అధికారకంగా జరగలేదు అయితే మొదటిసారి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన వంద రూపాయల నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ఇలా ఎన్టీఆర్ కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్లు మనవాళ్ళు మనవరాలతో పాటు నందమూరి ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమానికి మాత్రం హరికృష్ణ వారసులైనటువంటి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు.

 

ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ దూరంగా ఉండడంతో ఈయన దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఇదే కారణమైతే దేవర షూటింగ్ లోకేషన్ నుంచి ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి రావడానికి అక్కడ ఎవరు అడ్డు చెప్పరు. కానీ దీని వెనక ఏదో రాజకీయం కూడా ఉందని తెలుస్తోంది.

 

మొదటినుంచి కూడా ఎన్టీఆర్ కుటుంబాన్ని నందమూరి ఫ్యామిలీ దూరం పెడుతూనే వస్తున్నారు. నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంటూ వస్తున్నారు. అందుకే ఈ కార్యక్రమానికి కూడా ఆయనని ఆహ్వానించకుండా అవమానించారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు అయితే చంద్రబాబు నాయుడు బాలకృష్ణను కూడా కలవాల్సి ఉంటుందని కారణంతో కూడా ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోయి ఉండవచ్చు.

 

ఇకపోతే ఎన్టీఆర్ కి ఆహ్వానం అందిన కొందరు నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ను లూబీయింగ్ చేసి ఉండవచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి ఎదురుపడటం ఇష్టం లేకే ఈయన రాకపోయి ఉండవచ్చు ఇలా ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు కానీ దేవర సినిమా షూటింగ్ మాత్రమే కారణం అంటూ ఆయన పట్ల విమర్శలు చేయడం సరికాదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంపై స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -