Mahesh-Prabhas: మహేష్ కు ఒకలా ప్రభాస్ కు మరోలా మేకర్స్ కు ఇది న్యాయమేనా?

Mahesh-Prabhas:పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానిపై సహజంగానే అంచనాలు పెట్టుకుంటారు ప్రేక్షకులు. ఈ టైంలో మేకర్స్ కూడా క్యాష్ చేసుకోవడానికి టికెట్ రేట్లు హైక్స్ కి ప్రభుత్వాలకి అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. సినిమా బాగుంటే మొదటి వారం భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే పెద్ద హీరోల సినిమాలకి టికెట్ రేటు పెంచడంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పక్షపాతాలు చూపిస్తున్నాయి అంటున్నారు సినీ వర్గాల వారు.

 

అయితే ఈ వివక్ష ఏపీలో ఎక్కువగా కనిపిస్తుంది మొన్నటికి మొన్న ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా సలార్ రిలీజ్ అయితే అప్పుడు టికెట్టు 40 రూపాయలు రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం కానీ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రీజినల్ సినిమా గుంటూరు కారానికి 50 రూపాయలు హైక్ ఇచ్చింది ₹10 కె ఇంత డిస్కషన్ ఎందుకు అనుకోకండి, సాలార్ ఏపీలో కొన్ని ఏరియాలో రికార్డులు కొట్టడానికి చాలా కష్టపడింది.

ఒకవేళ ఇంకొక పది రూపాయలు పెంచి ఉండుంటే దానికి ఓపెనింగ్స్ ఇంకా పెరిగి ఉండేవి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈజీ అయి ఉండేది. ఇప్పుడు అదే పది రూపాయల డిఫరెన్స్ సలార్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది మహేష్ బాబు కి ఒక న్యాయము ప్రభాస్ కి ఇంకొక న్యాయము అన్నట్లు ఏపీ ప్రభుత్వం వ్యవహరించడం నిజంగా దురదృష్టకరం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.

 

50 రూపాయలు రేటు పెంచడం వలన ఆంధ్రప్రదేశ్లో సింగిల్ స్క్రీన్ లో గరిష్ట టికెట్ ధర 205 అయింది. ఇక మల్టీప్లెక్స్ లో ప్రీమియంలో 235 రిక్లైనర్స్ లో 355 రేట్లు ఉండబోతున్నాయి పెంచిన ధరలు రిలీజ్ అయిన డేట్ నుంచి పది రోజుల పాటు అమలులో ఉంటాయి. ఎలాంటి అదనపు ఆటలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Related Articles

ట్రేండింగ్

YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు...
- Advertisement -
- Advertisement -