BRS: కేసీఆర్ ప్రభుత్వం ఇలా చేయడం న్యాయమేనా.. ఏమైందంటే?

BRS: హైదరాబాదులో ఎకరం భూమి కొనుగోలు చేయాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోకాపేట అంటే ఎకరం వంద కోట్లు పలికే ప్రాంతం. ఇలాంటి ఖరీదైన ప్రాంతంలో ఏకంగా 11 ఎకరాల భూమిని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అత్యంత తక్కువ ధరకే ఇవ్వడంతో ఈ విషయం కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రూ.6000 కోట్ల విలువైన స్థలాన్ని.. కేవలం రూ.37.53 కోట్లకే ముట్టజెప్పేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.

కొత్త సెక్రటేరియట్ లో గురువారం జరిగిన కేబినెట్​ మీటింగ్​లో అత్యంత రహస్యంగా ఈ ఫైల్ క్లియర్ అయిపోయింది. కేబినెట్​లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు కూడా బీఆర్ఎస్​కు 11 ఎకరాల భూమిని కేటాయించిన విషయం మాట మాత్రమైనా తెలియ చేయకపోవడం గమనార్హం.అధికార పార్టీకి సంబంధించిన ఫైల్ కావడంతో దీని గురించి ఏ మాత్రం చడి చప్పుడు లేకుండా ముందుకు కొనసాగింది.

 

ఇలా కోకాపేట్ లో ఇంత ఖరీదైన 11 ఎకరాల స్థలం బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. ఈ 11 ఎకరాల స్థలంలో కాలేజ్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెలవప్మెంట్ పెడతామని పదకొండు ఎకరాలు కావాలని బీఆర్ఎస్ వైపు నుంచి ప్రతిపాదనలు రావడంతో కలెక్టర్లు సైతం హడావిడిగా ఈ ఫైల్ ముందుకు పంపినట్టు తెలుస్తుంది.

 

అయితే బిఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ఖరీదైన భూములను తీసుకోవడం ఇది మొదటిసారి కాదని ఇదివరకు కూడా ఇలాంటి ఖరీదైన భూములు పార్టీ కార్యకలాపాల కోసం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈసారి మాత్రం కాలేజీ ఏర్పాటుకు 11 ఎకరాల భూమిని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయడంతో ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -