Chiranjeevi-Mohan Babu: చిరంజీవి, మోహన్ బాబులను ఇంత ఘోరంగా అవమానించడం అవసరమా?

Chiranjeevi-Mohan Babu: చిరంజీవి, మోహన్ బాబు ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ.. ఒకరి తప్పులను మరొకరు ఎత్తిపొడుచుకోవడం మళ్లీ కలిసి పోవడం అనేది సినీ అభిమానులకి అలవాటే కానీ ఇప్పుడు ఇద్దరికీ కలిపి అవమానం జరగడంఅనేది ప్రాముఖ్యతని సంతరించుకుంది. వీళ్ళిద్దరిని ఇంత ఘోరంగా అవమానించడం అవసరమా అంటూ సోషల్ మీడియా కోడై చూస్తుంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఈనెల 20వ తారీఖున మహానటుడు, తెలుగుదేశం అధినేత, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహా ధీరుడు నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలు హైదరాబాదులో జరగనున్నాయి. 2023 మే 28 నాటికి మహా నాయకుడికి వందేళ్లు నిండుతాయి.

 

అందుకే 2022 మే 28 నుంచి 2023 మే 28 వరకు ఎన్టీఆర్ ని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే మే 28న హైదరాబాదులో ఆ మహానటుడు శతజయంతి ఉత్సవాలు నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు.

 

అయితే ఈ వేడుకలకి తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఉపయోగపడతారో.. ఎవరైతే చంద్రబాబు కి భజన చేస్తున్నారు వాళ్ళని మాత్రమే పిలిచినట్లుగా తెలుస్తోంది. చిరంజీవిని మోహన్ బాబుని ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని సమాచారం. ఎన్టీఆర్ లిటరేచర్ సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ వెల్లడించిన వివరాల ప్రకారం అల్లు అర్జున్, ప్రభాస్.

 

సుమన్, మురళీమోహన్, వెంకటేష్, పవన్ కళ్యాణ్, రాఘవేంద్రరావు, అశ్విని దత్ తదితరులను ఆహ్వానించారు. వీరిలో చాలామంది చంద్రబాబు నాయుడు భజనపరులే. ఇక జూనియర్ ఎన్టీఆర్ ని కళ్యాణ్ రామ్ ని తప్పనిసరి పరిస్థితులలో పిలవవలసి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సపోర్టు తెలుగుదేశానికి చాలా అవసరం.

 

కానీ అదే రోజు ఆయన పుట్టినరోజు కావడంతో ఆయన వస్తారో రారో అనేది అనుమానమే. ఇక ప్రభాస్ ని ఆహ్వానించడం వెనక రాజుల కమ్యూనిటీ తో పాటు ఆయన అభిమానులను ఆకర్షించే ప్రయత్నం దాగి ఉంది. ఇలా ఏ విధంగా చూసుకున్నా ఇది మహా నాయకుడిని వాడుకొని పార్టీ ప్రయోజనాలకు చేకూర్చే వేడుకగా వాడుకుంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -