Elections: చంద్రబాబు, జగన్ లను ఓడించడం సాధ్యమయ్యే పనేనా?

Elections: ఏపీలో రాబోయే ఎన్నికలు ఓ యుద్ధంలా సాగనున్నాయి. ప్రధానంగా అధికార వైసీపీ, టీడీపీ మధ్యనే పోటీ ఉండనుంది. జనసేన పార్టీ కూడా కీలకంగా ఉన్నా, ఆ పార్టీ పొత్తులో ఉంటే టీడీపీకి కలిసి వస్తోంది. ఇక వైనాట్ 175 అంటున్న జగన్, చంద్రబాబు అడ్డ కుప్పంలో గెలవాలని చూస్తున్నారు. ఇక పట్టభద్రుల ఎన్నికల్లో పులివెందులలో భారీగా ఓట్లు కొల్లగొట్టిన టీడీపీ, అక్కడ ఎమ్మెల్యే సీటు గా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరులోని కుప్పం, కడపలోని పులివెందుల చంద్రబాబు, వైఎస్ జగన్ కుటుంబానికి కంచు కోటలు. అక్కడ ఓటమి అనేది వారు ఎరుగలేదు. దశాబ్దాలుగా గెలుస్తూనే వస్తున్నారు. ప్రత్యేర్థులుగా నిలబడ్డా, ఎవరూ గెలిచే పరిస్థితి లేదు. అయితే కుప్పం మున్సిపాలిటీని గత ఎన్నికల్లో వైసీపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ సీటుపై జగన్ ఫోకస్ పెంచారు. అక్కడ వైసీపీ జెండా పాతి తన సత్తాని చంద్రబాబుకు చూపాలని ఆలోచిస్తున్నారు. అందుకు గట్టి ప్రణాళికనే సిద్ధం చేశారని వైసీపీలో ప్రచారం ఉంది.

 

ఇక పులివెందుల రాజారెడ్డి కుటుంబానికి పెట్టింది పేరు.అక్కడ వారిదే రాజ్యం. సామాజిక వర్గ పరంగా చూసుకున్న రెడ్లు ఎక్కువ మంది ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వైఎస్ కుటుంబానికి ఆ అసెంబ్లీ సీటు రాసిచ్చారు. అక్కడ ప్రజలు కూడా వారిని అంతలా ఆదరిస్తారు. అయితే తాజాగా జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం రివర్స్ గేర్ పడింది జగన్ కి. అక్కడ ఎక్కువ శాతం ఓట్లు టీడీపీ అభ్యర్థికి గుద్దారు. దీంతో అక్కడ తమ జెండాని పక్కగా పాతుతామని టీడీపీ చెబుతోంది.

 

ఆ రెండు నియోజకవర్గాల్లో పాత జెండాలు ఉంటాయో లేదా కొత్త జెండాలు వస్తాయో చూడాలి మరి. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. అంత వరకు వెయిట్ చేస్తే ఏ జెండా ఎక్కడా వస్తోందో తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -