KCR: కేసీఆర్ ఎన్నికల హామీల అమలు సాధ్యమేనా.. ఆ హామీ అమలు ఎక్కడ అంటూ?

KCR: ప్రస్తుత కాలంలో ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు కోసం సంక్షేమ పథకాలపై ఆధారపడుతోంది. ప్రజలు సైతం మంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న పార్టీలకు ఓటేస్తే తమ జీవితం బాగుపడుతుందని ఫీలవుతున్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఈ పథకాల వల్ల ఎక్కువగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. కేసీఆర్ తాజాగా ప్రజలకు మేలు చేసేలా ఎన్నో పథకాలను, హామీలను ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీని మించిన పథకాలను ప్రకటించాలని భావించిన కేసీఆర్ వృద్ధాప్య పెన్షన్లను ఐదు వేలకు పెంచుతానని ప్రకటించారు. దశలవారీగా రైతు బంధు 16,000 రూపాయలు చేస్తానని హామీ ఇచ్చారు. రేషన్ లో సన్నబియ్యం ఇస్తానని అర్హులైన మహిళలకు నెలకు 3,000 రూపాయల భృతి ఇస్తామని, ఇతర హామీలను సైతం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ హామీల అమలు సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గత ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి హామీని ప్రకటించిన కేసీఆర్ ఆచరణ సాధ్యం కాని ఆ హామీని నెరవేర్చలేకపోయారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3016 ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఈ ఎన్నికల సమయంలో ఆ హామీని మాటవరసకైనా చెప్పలేదు. నిరుద్యోగ భృతి గురించి యువత నుంచి ప్రశ్నలు ఎదురవుతూ ఉండగా ఆ హామీ అమలు ఎక్కడ కేసీఆర్ అంటూ నిరుద్యోగులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

నిరుద్యోగ భృతిపై కీలక ప్రకటన ఉంటుందని భావించిన వాళ్లు కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోపై నిరాశకు గురవుతున్నారు. తెలంగాణలో ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ఏం చేస్తుందో చూడాలి. తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య 30 లక్షలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది. ఇన్ని హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్ ఈ హామీ అమలును ఎందుకు విస్మరిస్తున్నారనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -