Supreme Court: ప్రభుత్వ తప్పుడు ప్రకటనలపై సాక్షికి షాక్.. కోర్టుల్లో కూడా వైసీపీ పరువు పోతుందిగా

Supreme Court: ప్రభుత్వ ప్రకటనలు ఎలా ఉండాలనే దానిపై 2015లో సుప్రీంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అందులో ఉండే నిబంధనలు, రూల్స్‌ను క్లియర్‌గా వివరించింది. కానీ, వైసీపీ ప్రభుత్వం అవేవీ పట్టించుకోలేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి ప్రభుత్వ ప్రతీ రూపాయి ఖర్చు చేస్తుంది. అందుకే ఖర్చు చేసిన ప్రతీ రూపాయికి అర్థం ఉండాలి. ప్రభుత్వానికి జవాబు దారీతనం కూడా ఉండాలి. అందులో వాస్తవాలు కూడా ఉండాలి. ప్రభుత్వం ఓ ప్రకటన చేసిందంటే.. దానర్థం ఏదైనా ఒక విషయాన్ని ప్రజలకు తెలియజేయడం. అంతేకాని అబద్దాలు ప్రచారం చేయడం కాదు. ఉదాహరణకు కరోనా సమయంలో ఇన్ని కోట్ల మందికి ఫలానా వ్యాక్సిన్‌ను ప్రభుత్వం అందించింది అని ఓ ప్రకటన చేస్తే.. దాని అర్థం అదే వ్యాక్సిన్ కు ప్రభుత్వం నుంచి పర్మిషన్ లభించిందని ప్రజలకు తెలియాలి. వ్యాక్సిన్ కొనుగోలు చేసుకోవాలని అనుకునే వాళ్లు ఆ వ్యాక్సిన్ కొనుగోలు చేసుకోవాలనే ఓ అవగాహన రావాలి.

కొన్ని కోట్లమంది ఆ వ్యాక్సిన్ వేసుకున్నారు అంటే.. ఆ వ్యాక్సిన్ కరోనా మహమ్మారిపై బాగా పని చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. ప్రకటనల వెనకు ఇంత అర్థం ఉంటుంది. అంతేకానీ దాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని అనుకుంటే క్రైమ్‌తో సమానం. ఎందుకంటే అది ప్రజల సొమ్ము. దాన్ని వ్యక్తిగత, రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం సరికాదు. అంతేకాదు.. ప్రకటనలు గత ప్రభుత్వాలను కించపరిచేలా కూడా ఉండకూడదు. అలా చేస్తే రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడం కోసం ప్రజల సొమ్ము వృధా చేసినట్టే అవుతోంది.

వైసీపీ ప్రభుత్వం ఈ నిబంధనలను పట్టించుకోలేదు. సాక్షాత్తు కోర్టు ఇచ్చిన రూలింగ్‌ను కూడా తుంగలో తొక్కేసింది. కానీ, ఎల్లకాలం మనది కాదు. టైం మనకు ఎదురుతిరుగుతుంది. ఆ టైం వైసీసీకి వచ్చింది. సుప్రీం కోర్టుల నిబంధనలను ఉల్లంఘిస్తూ వందల కోట్ల విలువైన ప్రకటనలను ఇచ్చారని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ సర్కార్ తో పాటు సాక్షి ఛానల్‌కు కూడా ఉత్తర్వలు ఇచ్చింది. ఏపీ సర్కార్ వైసీపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేలా ప్రకటనలు ఇచ్చిందని.. దాని కోసం ప్రభుత్వ సొమ్మును వాడుకుందని చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ప్రకటనలకు సుమారు నాలుగు వేల కోట్లు ఖర్చు చేశారని వివరించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని.. వృధా అయిన ప్రజాధనం వైసీపీ పార్టీ నుంచి వసూలు చేయాలని కోర్టును కోరారు.

ప్రభుత్వ ప్రకటనలు ప్రజల్లో అవగాహన కల్పించేలా ఉండాలని.. ప్రభుత్వ కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లేలా ఉండాలని ఆయన తన పిటిషన్‌లో గుర్తు చేశారు. ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని ప్రజలు వినియోగించుకోవడం కోసమే ప్రకటనలు ఇవ్వాలని తెలిపారు. కానీ, వైసీపీ పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేలా ఏపీ సర్కార్ ప్రకటనలు ఉన్నాయని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను తుంగలో తొక్కిందని తన పిటిషన్ లో వివరించారు.

దీనిపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అంతేకాదు సాక్షి మీడయా కూడా నోటీసులు పంపించింది. మొత్తానికి ఎన్నికల ముందు వైసీపీకి, సాక్షి మీడియాకు ఊహించని దెబ్బలు తగులుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -