CM Jagan: సుప్రీం కోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోని జగన్ సర్కార్.. మరీ ఇంత ఘోరమా?

CM Jagan: ఇటీవలే ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పర్యావరణ అనుమతులు తీసుకునే వరకు ఇసుక తవ్వకాలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇసుక తవ్వకాలు నిలిపివేయకుండా అలాగే కొనసాగిస్తున్నారు. మామూలుగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అంటే వెంటనే ఆ పని ఆపేస్తారు అని అందరూ అనుకున్నారు. సహజంగా అదే చేయాలి. కానీ ఇక్కడ ఏపీలో ఉన్న పాలకులకు సుప్రీంకోర్టా రాజ్యాంగమా అన్నది అనవసరం,తమ చేతిలో అధికారం ఉంది.

 

అధికారంలో తాము ఉన్నాం కాబట్టి అనుకున్నట్లుగా చేసేస్తామని అనుకుంటారు చేసేస్తారు అంతే. ఆ విషయంలో ఎలాండి డౌట్ లేదు. ఇసుక విషయంలోనూ అదే జరుగుతోంది. టీడీపీ హయాంలో ఉచిత ఇసుక విధానం అమలయింది. ఇష్టారీతిన తవ్వకాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఇసుక మొత్తం ఒకరే దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీ కూడా అడ్డగోలుగా సాగుతోంది. ఎక్కడ ఇసుక ఉంటే అక్కడ పెద్దపెద్ద యంత్రాలతో తవ్వేస్తున్నారు. వందల కొద్ది లారీల్లో ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలి పోతోంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరినా ఎన్జీటీ పర్మిషన్లు తీసుకునేవరకూ ఆదేశించినా పట్టించుకోవడం లేదు.

జేపీ పేరుతో తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. 151 సీట్లు వచ్చాయన్న కారణం తామే సుప్రీం అని జగన్ రెడ్డి అనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే నిబంధనలు, రాజ్యాంగం, చట్టాలు అనే ప్రస్తావన లేకుండా పరిపాలన చేస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలనూ అమలు చేయని పరిస్థితి ఏపీలో వచ్చింది ఇక ముందు ముందు ఎపీలో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ? సుప్రీంకోర్టు ఇదంతా జరుగుతున్నా చూస్తూ ఎందుకు ఊరుకుంది అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏపీ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి పై కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలని చాలామంది సుప్రీంకోర్టుని కోరుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫెయిల్డ్ ముఖ్యమంత్రా.. హామీల అమలులో అట్టర్ ఫ్లాప్?

CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏపీ అభివృద్ధిని గాలికి వదిలేసారన్నమాట వాస్తవమే. ఇలా అభివృద్ధిని పక్కనపెట్టి ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నాయకులు అధినేత...
- Advertisement -
- Advertisement -