Star Director: చిరు, బాలయ్యల కెరీర్ ను మార్చింది ఆ స్టార్ డైరెక్టరేనా?

Star Director: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈ ఇద్దరు హీరోల మధ్య ఉన్న స్నేహబంధం గురించి కూడా మనందరికీ తెలిసిందే. వీరు గత నాలుగు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో పోటీ పడుతూ వస్తున్నారు. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇద్దరు నేటితరం హీరోలకి చెమటలు పట్టిస్తున్నారు. బాలయ్య- చిరు సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి వస్తున్నాయంటే స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను ఆపేస్తున్నారు. దీనికి నిదర్శనం ఈ సంక్రాంతికి వచ్చిన ఇద్దరు హీరోలు సినిమాలు సూపర్ హిట్ గా నిలవడం.

ఇలాంటి ఈ ఇద్దరు హీరోలు తమ కెరీర్లు ఎందరో దర్శకులతో సినిమాలు చేశారు. కానీ బాలయ్య- చిరంజీవికి మాత్రం స్టార్ స్టేటస్ అందించిన దర్శకుడు మాత్రం కోదండరామిరెడ్డి అనే చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు ఉన్నా అందులో ఏ.కోదండరామిరెడ్డిది ప్రత్యేక శైలి అనే చెప్పాలి. దర్శకుడిగా ఒక మూసకే పరిమితం కాకుండా.. అన్ని రకాల జానర్స్‌లో సినిమాలు చేసి సూపర్ హిట్‌ అందుకున్న అతికొద్ది మంది దర్శకుల్లో కోదండరామిరెడ్డి కూడా ఒకరు. మనుషులు మారాలి సినిమాతో మొదలైన ఆయన కెరీర్ ఎంతోమంది మనుషుల జీవితాలను నిజంగానే మార్చేసింది. టాలీవుడ్‌లో చిరంజీవి, ఏ.కోదండరామిరెడ్డిది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.

 

వీళ్లిద్దరి కాంబినేషన్ దాదాపుగా 25 చిత్రాలు వచ్చాయి. అందులో ఎక్కువ శాతం సినిమాలు సక్సెస్ సాధించాయి. మొత్తంగా వీళ్లిద్దరి కలయికలో వచ్చిన సినిమాలో 22 హిట్లు ఉన్నాయి. వీరి కలయికలో వచ్చిన చిత్రాలు న్యాయం కావాలి ముఠామేస్త్రీ, అభిలాష, ఖైదీ, ఛాలెంజ్, విజేత, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, త్రినేత్రుడు, మరణ మృదంగం వంటి హిట్ చిత్రాలు వీరి ఖాతాలో ఉన్నాయి. ఇక బాలకృష్ణ, కోదండరామిరెడ్డి లది కూడా క్రేజీ కాంబినేషన్‌‌నే అనే చెప్పవచ్చు. మొత్తం వీరి కాంబినేషన్‌‌లో మొత్తం 13 చిత్రాలు రాగా అన్నీ సినిమాలు ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు కావడం విశేషం. వీరి కలయికలో వచ్చిన చిత్రాలు అనసూయమ్మగారి అల్లుడు, యువరత్న రాణా.. బొబ్బిలి సింహం, నారీ నారీ నడుమ మురారి, భానుమతి గారి మొగుడు వంటి చిత్రాలు వీరి ఖాతాలో ఉన్నాయి. కోదండరామిరెడ్డితో చేసిన సినిమాలు బాలకృష్ణకి మంచి హిట్‌‌గా నిలిచాయి. అంతేకాదు ఆయన కెరీర్‌‌కి మరింత ప్లస్ అయ్యాయి. ఇలా ఇద్దరు హీరోలకు కోదండరామిరెడ్డి తన సినిమాలతో మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టాడు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -