Jagan: సినిమాలతో ప్రజలను మాయ చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారా?

Jagan: తాజాగా తిరుపతిలో ఇండియా టుడే సదస్సు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 3.5 కోట్లు పెట్టి నిర్మించారు. అలాగే అందులో సీఎం జగన్‌ను ఇరకాటంలో పెట్టని విధంగా స్ర్కిప్టు ప్రకారమే ప్రశ్నలను సంధించారు. ఎన్ని అబద్ధాలు, అర్ధసత్యాలు చెప్పినా కౌంటర్లు లేవు. హామీల వైఫల్యం గురించి ప్రస్తావన లేకుండా అనుకూలంగా, భజన తరహాలో సదస్సు ముగిసింది. మరి ఈ సదస్సులో సీఎం జగన్‌ చెప్పిందేమిటి, అసలు వాస్తవాలు ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే..

 

సీఎం: ధనికుల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నప్పుడు, పేదల పిల్లలు ఎందుకు చదవకూడదు? ఆ అంతరాన్ని తొలగించడానికే ఇంగ్లిష్‌ మీడియం బోధన అమలు చేస్తున్నాము అని తెలిపారు. మరి ఇదే విషయం వాస్తవంలోకి వెళితే.. విద్యార్థుల తల్లిదండ్రులుగానీ, ప్రతిపక్షాలుగానీ ఇంగ్లీష్‌ మీడియం వద్దని ఎక్కడా చెప్పలేదు. రెండు మాధ్యమాలు ఉంచాలని డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వం అకస్మాత్తుగా తెలుగు మీడియం తొలగించడంతో చాలామంది పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్యాశాఖ తల్లిదండ్రులతో బలవంతంగా ఇంగ్లిష్‌ మీడియం మాత్రమే కావాలని సంతకాలు చేయించుకుంది. అయితే వెంటనే దీనిని తొలగించాలని న్యాయ ప్రభుత్వం చెప్పినా కూడా ప్రభుత్వం మాత్రం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.

 

అలాగే ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 8, 9 తరగతుల పిల్లల వద్ద ట్యాబ్‌లు ఉన్నాయి. నా పుట్టినరోజు నాడు ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇది ఏటా కొనసాగుతుంది అని సీఎం జగన్ తెలిపారు. మరి ఇదే విషయం రాష్ట్రంలోకి వచ్చేసరికి.. రెండేళ్ల కిందట ప్రభుత్వం వద్ద ట్యాబ్‌ల ఆలోచనే లేదు. 9 నుంచి ఇంటర్‌ వరకు చదివే పిల్లలకు అమ్మఒడి వద్దనుకుంటే ల్యాప్‌ట్యాప్ లు ఇస్తామని జగన్‌ ప్రకటించారు. దీంతో 7లక్షల మంది విద్యార్థులు ల్యాప్‌ట్యాప్‌ల కోసం ఆప్షన్‌ ఇచ్చారు. ఆ తర్వాత సీన్‌ మారిపోయింది. అసలు ల్యాప్‌ట్యాప్ లు అనే హామీని ఇవ్వలేదన్నట్టుగా ట్యాబ్‌ల విధానం తెచ్చారు. అదికూడా ఏడాది ఒక్క తరగతికే. ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామన్న మాట ఎందుకుతప్పారు? ఆ హామీ ఏమైంది? అనే ప్రశ్నలు సదస్సులో రాలేదు.

నాడు-నేడు పనులు రూ.14వేల కోట్ల అంచనాతో మొదలు పెట్టాము. అందులో ఇప్పటివరకూ రూ.8300 కోట్లు ఖర్చు చేశాము. వచ్చే మార్చి నాటికి మూడో విడత పూర్తిచేస్తాము అంటూ పెద్ద పెద్ద ప్రగల్పాలు పలికారు. మరి వాస్తవం లోకి
అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌ ప్రభుత్వం నాడు నేడు ప్రారంభించింది. మూడేళ్లలో మొత్తం పూర్తిచేస్తామని ప్రగల్భాలు పలికింది. మొదటి దశలో 15,575 బడుల్లో పనులు పూర్తయ్యాయి. రూ.8 వేల కోట్లతో చేపట్టిన రెండో దశలో ఇంకా సగం పనులే పూర్తయ్యాయి. ఎన్నికల్లోగా రెండో దశ పూర్తికావడం కష్టం. మూడో దశ గురించి ఆలోచనే లేదు. మొత్తంగా రెండు దశల్లో సుమారు 31వేల బడులను చేపట్టగా, మిగిలిన 14వేల బడుల్లో ఎందుకు పూర్తిచేయలేకపోయారో సీఎం చెప్పలేదు.

 

2018 లో మా రాష్ట్రంలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు వంద శాతానికి తీసుకొచ్చాం అని చెప్పారు మన జగనన్న మరి వాస్తవం లోకి వెళితే.. ఇదే నిజమైతే బడి బయట పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించాలని ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌లు ఎందుకు నిర్వహించింది? ఎంత ప్రయత్నించినా కొందరు పిల్లల్ని ట్రేస్‌అవుట్‌ చేయలేకపోతున్నామంటూ వలంటీర్లు చేతులెత్తేశారు. పిల్లలంతా బడుల్లో లేరని పాఠశాల విద్య అధికారులే సీఎంకు సమీక్షలో తెలిపారు. ఇప్పుడు వంద శాతం జీఈఆర్‌ సాధించామని ఎలా చెప్పారో జగన్‌కే తెలియాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -