Jagan: ఎన్నికల తర్వాత జగన్ పరిస్థితి అలా ఉండబోతుందా.. ఏమైందంటే?

Jagan: రాజకీయాల్లో హత్యలుండవు.. అన్నీ ఆత్మహత్యలే.. దీనికి ఉదాహరణ వైసీపీ అధినేత జగన్.. ఈ మాటలు చెప్పింది మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు. సీఎం జగన్ తన గొయ్యి తానే తీసుకుంటున్నాడని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో జగన్ రికార్డును టీడీపీ కూటమి బద్దలు కొడుతుందని జోస్యం చెప్పారు. 151 కంటే ఎక్కువ సీట్లు టీడీపీ కూటమి గెలుస్తుందని అన్నారు. దీనికి కారణం ప్రతిపక్షాలు కాదని.. ప్రతిపక్షాల గెలుపునకు జగనే కారణమవుతారని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఆయన ద్వజమెత్తారు. నవరత్నాల పేరుతో దివాళ తీయించారు తప్పా.. ఉపయోగం ఏమీ లేదని విమర్శించారు. జగన్ అన్ని వర్గాల ప్రజలను దూరం చేసుకున్నారని అన్నారు. షర్మిల కారణంగా క్రిస్టియన్లు, మైనారిటీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయని చెప్పారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన యువత ఈ సారి టీడీపీ కూటమి వైపు తిరిగారని అన్నారు.

 

ఈ ఐదేళ్లు జగన్ పాలనపై కాకుండ ప్రత్యర్థులపై దృష్టిపెట్టారని విమర్శించారు. చంద్రబాబుపై కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టించడం జగన్ చేసి చారిత్రాత్మక తప్పిదమని అన్నారు. చంద్రబాబును జగన్ తక్కువ అంచనా వేశాడని.. ముందుముందు దాని ఫలితాన్ని ఆయన చూస్తాడని అన్నారు. అటు షర్మిల, సునీత విషయంలో కూడా జగన్ చేసిన తప్పు కాంగ్రెస్ ను పెంచిపోషించేలా చేసిందని చెప్పారు. జగన్ చేసిన తప్పులే వైసీపీని ముంచేస్తాయని తెలిపారు. టికెట్ల కేటాయింపు విషయంలో కూడా చాలా పెద్దతప్పు చేస్తున్నారని అన్నారు. విడదల రజనీ, రోజాకు టికెట్ దక్కవని.. ఇప్పటికే ప్రకటించిన వారిలో కనీసం 35 మందికి బీఫాంలు అందవని జోస్యం చెప్పారు.

గోనె ప్రకాశ్ రావు చెప్పినట్టు.. నిజంగానే జగన్ తన చేతులతో తానే రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమువుతోంది. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం కానీ.. జగన్ అసలు భవిష్యత్తే లేకుండా చేసుకుంటున్నారని అంటున్నారు. తప్పు మీద తప్పు చేసి అయినావాళ్లను దూరం చేసుకుంటున్నారని.. సంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకును కూడా దూరం చేసుకుంటున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దళితులు, క్రిస్టియన్లు, మైనార్టీలు వైసీపీకి పెట్టని కోటలా ఉండేవారు. కానీ, వారిని చేతులారా వారిని దూరం చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. షర్మిల విషయంలో ఆయన మొండిగా వ్యవహారించకపోతే ఏపీలో కాంగ్రెస్ బలపడేది కాదని అంటున్నారు. అసలు ఏపీలో కాంగ్రెస్ మాట వినిపిస్తుందా? అన్న స్థాయి నుంచి ఇవాళ అదే పార్టీ పేరు ప్రతీ నోట వినిపించేలా జగనే చేశారని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు కానీ.. వైసీపీ ఓటు బ్యాంక్ కొల్లగొడుతుందని అనుమానిస్తున్నారు. అంతేకాదు.. జగన్ ను నమ్ముకున్న రాజకీయ నాయకులకు కూడా నూకలు ఉండవనే ప్రచారాన్ని విపక్షాలు బలంగా తీసుకెళ్తున్నాయి.

 

ఆయన్ని నమ్ముకున్న కొండాసురేఖ ఎంత నష్టపోయిందో చూశాం. జగన్ ను వదిలేసిన ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, పువ్వాడ అజయ్ లాంటి వారు రాజకీయంగా నిలదొక్కుకున్నారని అంటున్నారు. కొండాసురేఖకు భ్రమలు తొలగి కాంగ్రెస్‌లో యాక్టీవ్ అయిన తర్వాత తనకు భవిష్యత్ పై నమ్మకం కలిగిందని గోనె ప్రకాశ్ కూడా అన్నారు. గోనే ప్రకాశ్ కామెంట్స్ చూస్తే.. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -