Alekhya Reddy: అలేఖ్యారెడ్డి పిల్లల కోసం జూనియర్ ఎన్టీఆర్ అలా చేస్తున్నారా?

TarakAlekhya Reddy: నందమూరి తారకరత్న మృతితో ఆ కుటుంబం ఇప్పటికీ విషాదంలోనే ఉంది. ఈ ఘటన నందమూరి, నారా కుటుంబాలకు తీరని లోటు. ముఖ్యంగా అలేఖ్య రెడ్డి ఫ్యామిలీకి తారకరత్న లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఇంటికి పెద్దగా పిల్లలకు తండ్రిగా అన్నీ బాధ్యతలు చూసుకునే వ్యక్తి ఆ కుటుంబానికి లేకపోవటం ఎంతో బాధాకరం. అయితే పిల్లల విషయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 

 

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, తార‌క‌ర‌త్న ఇద్ద‌రూ నంద‌మూరి హీరోలే. కొన్ని నెలలు అటు ఇటుగా దాదాపు ఒకేసారి కెరీర్‌ను స్టార్ట్ చేశారు. అయితే ఒకానొక స‌మ‌యంలో వీరిద్ద‌రూ మ‌ధ్య పోటీ న‌డిచింద‌నే వార్త‌లు బ‌లంగా వినిపించాయి. అయితే ఈ రూమ‌ర్స్‌ను తార‌క‌ర‌త్న కొన్ని ఇంట‌ర్వ్యూస్‌లో ఖండించారు. ఎన్టీఆర్ కంటే తార‌క‌ర‌త్న పెద్ద‌వాడు. అలాగే తార‌క‌రత్న‌ హీరోగా ఎంట్రీ ఇచ్చే స‌మ‌యానికి జూనియ‌ర్ ఎంట్రీ ఇవ్వ‌ట‌మే కాదు.. ఆది సినిమాతో స్టార్ హీరో ఇమేజ్‌ను వ‌చ్చేసింది. ఇదే విష‌యాన్ని తార‌క‌రత్న ఇంట‌ర్వ్యూస్‌లో చెప్పి త‌న‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో పోటీ ఎప్పుడూ లేద‌ని క్లియ‌ర్ క‌ట్‌గా చెప్పేశారు. నా కుటుంబాన్ని పోషించుకోలేని ప‌రిస్థితిలో ఉన్న‌ప్పుడు త‌మ్ముడు అండ‌గా నిలిచారు అని అన్నారు.

 

తార‌క‌ర‌త్న ‌‌అలేఖ్యా రెడ్డిని ‌ప్రేమ‌ వివాహం చేసుకున్నారు. పెద్ద‌లు వ‌ద్ద‌న్నా, విన‌కుండా పెళ్లి చేసుకోవ‌టంతో కుటుంబ స‌భ్యులు కొన్నాళ్లు తార‌క‌ర‌త్న‌తో మాట్లాడ‌లేదు. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు డ‌బ్బులు ప‌ర‌మైన స‌మ‌స్య వ‌చ్చింది. అలాంటి సిట్యువేష‌న్‌ను తెలుసుకున్న‌ జూనియ‌ర్ ఎన్టీఆర్ తార‌క‌ర‌త్న‌కు ఆర్థిక ‌‌‌‌సాయం చేశారట. ఇప్పుడు కూడా తన అన్న పిల్లలకి అండగా ఉండాలని యంగ్‌ టైగర్‌ నిర్ణయం తీసుకున్నాడట. అందుకే తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యతలను తీసుకున్నారని తెలిసింది. అంతేకాకుండా వారి చదువుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారట. వారి చదువులు పూర్తై, జీవితంలో స్థిరపడే వరకు అండగా ఉండాలని ఎన్టీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి ఈ విషయం తెలిసి ఎంతో సంతోషిస్తున్నారట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -