KTR: మునుగోడు ఎన్నిక తర్వాత తెలంగాణ సీఎంగా కేటీఆర్?

KTR:  మంత్రి కేటీఆర్ సీఎం అవుతారనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. గతంలో చాలాసార్లు కేటీఆర్ సీఎం అవుతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ తనకు ఆరోగ్యం బాగానే ఉందని, తానే సీఎంగా ఉంటానంటూ సీఎం కేసీఆర్ పలుసార్లు బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఇక కేటీఆర్ కూడా కేసీఆర్ నే సీఎంగా ఉంటారంటూ పలుమార్లు వెల్లడించారు. కేసీఆర్ బాటలోనే తాను నడుస్తానని, ఆయన ఏది చెబితే అది చేస్తాననంటూ కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం, బీఆర్ఎస్ పేరుతో నేషనల్ పాలిటిక్స్ లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో.. మరోసారి కేటీఆర్ సీఎం టాపిక్ తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నికలు జరుగుతుండటం.. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత కేటీఆర్ కు పగ్గాలు అప్పగించి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారనరే ప్రచారం జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించాలంటే.. వివిధ రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంటుంది. ఎక్కువ సమయం వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు చేయాల్సి ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా కేటీఆర్ కు అప్పగించి కేసీఆర్ మోదీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని బావిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ భవన్ పనులు శరవేగంగా జరుగుతున్నా.. కొద్ది నెలల్లో పూర్తి కానున్నాయి. కానీ ప్రస్తుతానికి అద్దెకు ఓ కార్యాలయాన్ని తీసుకున్న కేసీఆర్.. బీఆర్ఎస్ కార్యాలయాన్ని అందులో ఏర్పాటు చేయనున్నారు.

గత కొద్దిరోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని పరిశీలించారు. కొన్ని వాస్తు మార్పులు సూచించారు. ఆ కార్యాలయంలో ఈ నెలలో సిద్దం కానుంది. దీంతో కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషిస్తారని, డిల్లీలోనే ఎక్కువ కాలం ఉంటారని చెబుతున్నారు. కేటీఆర్ హైదరాబాద్ లో ఉండి పాలనా వ్యవహరాలన్నీ చూసుకుంటారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతల నోట కేటీఆర్ సీఎం అనే మాట వినిపిస్తోంది. త్వరలోనే కేటీఆర్ సీఎం అవుతారంటూ, కాబోయే సీఎం అయనేనంటూ టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో మునుగోడు ఎన్నికల తర్వాత కేటీఆర్ నే సీఎం అనే టాక్ వినిపిస్తోంది.

ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యల ుచేశారు. కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ తర్వాత కేటీఆర్ నే సీఎం కదా అని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, కేసీఆర్ ప్రయత్నాలు ఫలిస్తే కేటీఆర్ నే సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీంతో మునుగోడు ఎన్నికల తర్వాత కేటీఆర్ ను సీఎం చేస్తారనే వార్తలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలతో మరింత బలం చేకూరుతుంది. కేసీఆర్ తర్వాత సీఎంగా కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వందకు వంద శాతం కేసీఆర్ తర్వాత కేటీఆర్ నే సీఎం అని, పార్టీలో ఎవరిని అడిగినా అదే చెబుతారని అన్నారు.

మీడియా ప్రతినిధులు ఎవరూ అడగకపోయినా కాబోయే సీఎం కేటీఆర్ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ నే కావాలనే మంత్రులు, టీఆర్ఎస్ నోట కేటీఆర్ సీఎం అనే వ్యాఖ్యలను లీక్ చేయిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -