Namrata: నమ్రతకు డబ్బు పిచ్చా.. అందుకే ఇలా జరుగుతోందా?

Namrata: అన్నీ ఉన్నప్పుడే కాపురం సక్కదిద్దుకోవాలని పెద్దలంటుంటారు. నమ్రతను పెళ్లి చేసుకున్న తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్థికంగా ఎంతో స్థిరపడ్డారనే చెప్పుకోవచ్చు. మహేష్ బాబు ఆర్థిక వ్యవహారాలన్నీ నమ్రతనే చూసుకుంటుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే చాలా వరకు స్టార్ హీరోల ఆర్థిక వ్యవహారాలను భార్యలు లేదా మేనేజర్లు చూసుకుంటుంటారు. కానీ మహేష్ బాబు సినిమా వ్యవహారాలు, రెమ్యునరేషన్, బిజినెస్ ఇలా ప్రతీ విషయంలో నమ్రత పాత్ర ఎక్కువగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. శ్రీమంతుడు సినిమా తర్వాతే ఈ టాక్ భారీగా వినిపించడం విశేషం. అప్పటివరకు రెమ్యునరేషన్ విషయంలో మహేష్ బాబు ఇన్వాల్ అయ్యే వారు. కానీ ఇప్పుడు ప్రతీది నమ్రతనే చూసుకుంటున్నారట.

 

మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఎవరైనా నిర్మాతలు వస్తే భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. రూ.55-60 కోట్ల వరకు రెమ్యునరేషన్ అడుగుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అంతమొత్తంలో డబ్బులు ఇచ్చుకోలేమని నిర్మాతలు చెబితే.. మహేష్ బిజీగా ఉన్నాడని, చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయని, ఆ సినిమాలు పూర్తయిన తర్వాత చూద్దామని చెప్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే మహేష్ బాబు సంపాదనను వివిధ రకాల వ్యాపారాల్లో నమ్రత పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే రియల్ ఏస్టేట్‌లో ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఏసియన్ యాజమాన్యంతో చేతులు కలిపి ఏఎంబీ మాల్‌ను ఏర్పాటు చేశారు. అలాగే మినర్వా పేరుతో మరో రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

 

అయితే మహేష్ బాబు సంపాదనతో నమ్రత తెలివిగా పెట్టుబడులు పెట్టడంపై అందరూ అభినందిస్తున్నారు. కానీ మహేష్ బాబు రెమ్యునరేషన్‌ను కూడా ఆమెను డిసైడ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నమ్రతకు డబ్బు పిచ్చి ఉందని, అందుకే మహేష్ బాబు ఆర్థిక వ్యవహారాలను ఆమె చూసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే మరోవైపు మహేష్ బాబు కూడా నమ్రత చెప్పిన ప్రతీ విషయాన్ని కాదనరట. ఆమె చేయమన్న ప్రతీ పని చేస్తారని టాక్ వినిపిస్తోంది. చివరకు నమ్రత చెప్పడంతోనే యాడ్స్ చేస్తున్నారని, అలా అన్నివిధాలుగా మహేష్ బాబుకు ఉన్న క్రేజ్‌ను నమ్రత క్యాష్ చేసుకుంటోందని సమాచారం. వాస్తవానికి మహేష్ బాబుకు యాడ్స్ అంటే పెద్దగా నచ్చవట. కానీ భారీగా రెమ్యునరేషన్ రావడంతో.. మహేష్‌ను యాడ్స్ చేయమని నమ్రత ప్రోత్సాహిస్తారట. ఆర్థికంగా కుటుంబాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నమ్రత కష్టపడుతున్నప్పటికీ.. ఇండస్ట్రీలో ఆమెకు డబ్బుపై వ్యామోహం ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Narsapuram MP Candidate: ర‌ఘురామ‌కు న‌ర‌సాపురం టికెట్టే.. చంద్రబాబు పట్టుబట్టడంతో పొలిటికల్ లెక్కలు మారతాయా?

Narsapuram MP Candidate: వైసీపీ రెబెల్ ఎంపీగా పేరు సంపాదించుకున్నటువంటి రఘురామకృష్ణం రాజుకు ప్రస్తుతం ఏ పార్టీ నుంచి కూడా టికెట్ లేకపోవడంతో ఈయన పరిస్థితి కాస్త అయోమయంలో ఉంది కానీ ఈయన...
- Advertisement -
- Advertisement -