Mudragada: ఏపీ రాజకీయాల్లో ముద్రగడ సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమా?

Mudragada: ఏపీలో వైసీపీకి చెందిన విశాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ తో మాజీమంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా భేటీ అయిన విషయం తెలిసిందే. దాంతో ఇది కాస్త ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఇది రాజకీయంగా మరింత వైరల్ అవుతోంది. ముద్రగడ గత నెలలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో చేసిన ఆరోపణలకు బదులిస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అంతేకాకుండా పవన్ కి సవాల్ కూడా చేశారు. తనతో పోటీకి పిఠాపురంలో దిగు అంటూ సవాల్ విసిరారు. అయితే ఆ సమయంలో ముద్రగడకు బాహాటంగానే వైసీపీ నుంచి మద్దతు లభించింది.

ముద్రగడతో వైసీపీ ప్రధాన నాయకులు పలు మార్లు భేటీ వేసి ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడకు చంద్రబాబుతో గిట్టదని అంటారు. అందువల్ల ఆయనకు వైసీపీ సరైన రాజకీయ వేదిక అవుతుంది అని ఆ పార్టీ భావిస్తోంది. ముద్రగడ ఇటీవల కాలంలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యే లను తన నివాసంలో కలుసుకుంటున్నారు. అంతా ముద్రగడ ఉంటున్న కిర్లంపూడి నివాసానికి వచ్చి రాజకీయ చర్చలు జరిపాయని వార్తలు వెలువడ్డాయి. అయితే ఇపుడు ముద్రగడ స్వయంగా విశాఖ వచ్చి మంత్రి గుడివాడ ఇంటికి రావడంతో ఏదో లోలోపల రాజకీయంగా జరుగుతోంది అని అంటున్నారు.

 

అయితే ఇది జస్ట్ కర్టెసీ కాల్ అనే అంటున్నా కూడా ముద్రగడను వైసీపీలోకి చేర్చేందుకు జరిగే మరో ప్రయత్నం అని అంటున్నారు. ముద్రగడకు గట్టి మద్దతుదారుడిగా మంత్రి గుడివాడ అమరనాధ్ ఇటీవల కాలంలో చాలా ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఇపుడు ఈ ఇద్దరు భేటీలో ఏ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి అన్నది అన్ని పార్టీలలోనూ ఆసక్తిని రేపుతోంది. కాగా వైసీపీ మంత్రితో ముద్రగడ బీటీ కావడంతో ఏపీలో పొలిటికల్ లెక్కలు మారనున్నాయని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -