NTR: సంక్రాంతి సినిమాలకు ఎన్టీఆర్ భారీ షాకిస్తున్నారా.. అదే జరుగుతోందా?

NTR: సంక్రాంతి పండుగ అంటేనే థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సినిమాల హంగామా కనపడుతూ ఉంటుంది. సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకుంటూ చిన్న సినిమాల నుంచి మొదలుకొని పెద్ద హీరోల వరకు కూడా సంక్రాంతి బరిలో దిగుతూ నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏకంగా నలుగురు స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి అలాగే మరొక చిన్న హీరో సినిమాతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.

 

ఇలా మహేష్ బాబు రవితేజ వెంకటేష్ నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున అభిమానులు ఈ సినిమాలను సోషల్ మీడియా వేదికగా తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానుల సైతం సోషల్ మీడియాలో దేవర సినిమా హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం దేవర ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే జనవరి 8వ తేదీ సోమవారం సాయంత్రం 4:05 నిమిషాలకు ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు.

 

ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా దేవర హ్యష్ టాగ్ తో రచ్చ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సినిమా దెబ్బకు సంక్రాంతి రేసులో ఉన్నటువంటి సినిమా హీరోల అభిమానులు కూడా వనికి పోతున్నారని చెప్పాలి. దీంతో సోషల్ మీడియాలో సంక్రాంతి సినిమాలు వర్సెస్ దేవర గ్లింప్స్ అంటూ రచ్చ జరుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -