NTR-Prabhas: జూనియర్ ఎన్టీఆర్ ట్విస్ట్ కు ప్రభాస్ మైండ్ బ్లాంక్ అయ్యిందా?

NTR-Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపు పొందిన తెలుగు హీరోలు ప్రభాస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ ఫాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకోగా ఎన్టీఆర్ RRR అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ఇలా ఈ హీరోలకు ఇంటర్నేషనల్ వైడ్ ఎంతో మంచి ఆదరణ ఉందని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలసి సూపర్ హిట్ చిత్రం వార్ సీక్వెల్ చిత్రంలో నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఫిలిమ్స్ అధికారికంగా తెలియజేయకపోయినా తరుణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియచేయడంతో తారక్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వార్ సినిమాకు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే ప్రభాస్ హృతిక్ రోషన్ సిద్ధార్థ ఆనంద్ కాంబినేషన్లో ఈ సినిమా సీక్వెల్ రాబోతుంది అంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమా సీక్వెల్ చిత్రానికి సిద్ధార్థ ఆనంద్ స్థానంలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీని తీసుకువచ్చారు.అలాగే హృతిక్ రోషన్ కాంబినేషన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్నారని వార్తలు కూడా బయటకు వచ్చాయి.

ఇలా ప్రభాస్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో రాబోతుంది అనుకున్న ఈ సినిమా ఎన్టీఆర్ కాంబినేషన్లో రానుండడంతో ప్రభాస్ కి ఇది షాకింగ్ విషయమే అని చెప్పాలి. ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా తెలుగులో కూడా విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా తెలుగు ప్రమోషన్ కార్యక్రమాలలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఈ సినిమా గురించి చర్చలు జరిగి ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.ఏది ఏమైనా తారక్ సైలెంట్ గా ఉంటూనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలియడంతో ఫాన్స్ ఆనందపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -