Prashant Kishore :కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ మధ్య పెరిగిన దూరం.. టీఆర్ఎస్ కు పీకే టీం గుడ్ బై?

Prashant Kishore: గత రెండు ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. గత రెండు ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహలతోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ ఈ సారి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా సీఎం కేసీఆర్ నియమించుకున్నారు. ఆయన వ్యూహలతో ముందుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నట్లు మంత్రి కేటీఆర్ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక అనేకసార్లు కేసీఆర్ ను ప్రశాంత్ కిషోర్ కలిశారు.

తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపుకు కావాల్సిన వ్యూహలను సీఎం కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ అందిస్తున్నారు. కానీ ప్రశాంత్ కిషోర్ వ్యూహలను పార్టీ అధినేతలు అమలు చేయడం లేక అమలు చేయకపోవడం అనేది వారి ఇష్టం. జస్ట్ సలహాలు మాత్రమే వ్యూహకర్తలు ఇస్తూ ఉంటారు. ఇక వ్యూహలతో పాటు సర్వేలు చేయిస్తూ పార్టీ ఎక్కడ బలంగా ఉంది.. ఎక్కడ బలహీనంగా ఉంది.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇస్తే గెలుపొందే అవకాశముంది. పార్టీ బలహీనంగా ఉన్నచోట బలపడాలంటే ఏం చేయాలి లాంటి సలహాలను వ్యూహకర్తలు అందిస్తూ ఉంటారు.

అలాగే ప్రశాంత్ కిషోర్ అంటేనే సోషల్ మీడియా.. సోషల్ మీడియా ద్వారా పార్టీలకు హైప్ తెప్పించడం అనేది ఆయన స్పెషాలిటీ. దీంతో పార్టీలకు సోషల్ మీడియా వింగ్ లను తన ఆధీనంలోకి తీసుకుని వాటిని తన టీంతో నడిపిస్తూ ఉంటారు. గతంలో సోషల్ మీడియాలో టీఆర్ఎస్ స్లోగా ఉండేది. కానీ ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ తర్వాత టీఆర్ఎస్ సోషల్ మీడియాలో బాగా బలపడింది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులతో హల్ చల్ చేస్తోంది.

అయితే మొదట్లో బాగానే ఉన్నా.. ప్రస్తుతం కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ మధ్య బాగా గ్యాప్ పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీం సూచించే సలహాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదట. ఐప్యాక్ లోని ఉన్నత సిబ్బంది సీఎం కేసీఆర్ తో ఎప్పటికప్పుడు భేటీ అయ్యి సలహాలు, సూచనలు, సర్వే రిపోర్టులు ఇస్తూ ఉంటారు. వ్యూహల గురించి చర్చిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఐప్యాక్ టీంకు కనీసం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదట. ప్రజల నుంచి తాము సేకరించిన సమాచారాన్ని కేసీఆర్ తో పంచుకోవాలని ఐప్యాక్ టీం ట్రై చేస్తుంతడగా.. కేసీఆర్ పక్కన పెడుతున్నారట.

దీంతో ప్రశాంత్ కిషోర్, కేసీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పనిచేసేందుకు 300 మంది టీంను ప్రశాంత్ కిషోర్ నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీంతో కలిసి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో పర్యటించారు. అలాగే సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తో కలిసి ప్రశాంత్ కిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. టీఆర్ఎస్ తో డీల్ కుదుర్చుకున్న సమయంలో కేసీఆర్ ను ప్రశాంత్ కిషోర్ ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండేవారు.

కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇటీవల అసలు కేసీఆర్ ను ప్రశాంత్ కిషోర్ కలవడం మానేశారు. పీకే టీంను పూర్తగా కేసీఆర్ పక్కన పెట్టేశారు. దీంతో ప్రశాంత్ కిషోర్, కేసీఆర్ మధ్య పెద్ద గ్యాప్ వచచిందని, టీఆర్ఎస్ పార్టీకి పీకే టీం గుడ్ బై చెబుతుందనే ప్రచారం సాగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -