YS Sunitha: వివేకా హత్య కేసు పరిష్కారం కోసం సునీత అలా చేస్తున్నారా?

YS Sunitha: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మనందరికీ తెలిసిందే. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయి చాలా రోజుల్లో అవుతున్న కూడా ఆయన హత్యకి సంబంధించిన విషయంలో ఇప్పటికీ ఆయన కేసు ఒక కొలిక్కి రాలేదు. నిత్యం అందుకు సంబంధించి ఏదో ఒక రకమైన వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇకపోతే వివేకానంద రెడ్డి కూతురు సునీత ఆయన చనిపోక ముందు వరకు కూడా వైద్య వృత్తిలో ఉంటూ రాజకీయాలకు పూర్తి దూరంగా అన్న విషయం తెలిసిందే. కానీ తన తండ్రి చనిపోయిన తర్వాత సునీత పట్టుదల చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు..తన తండ్రి హత్య కేసులో భాగంగా దోషుల్ని కోర్టు మెట్లు ఎక్కించేందుకు ఆమె పడరాని పాట్లు పడింది.

వేరొక రాష్ట్ర ప్రభుత్వం లోనే వివేకా కేసు విచారణ జరిపించాలని సునీత పట్టుబట్టారు. ఆమె అనుకున్నది జరగడం కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొత్తానికి సునీత కష్టం ఫలించింది. సిబిఐ విచారణ జరిపి ఈ కేసును ఓ కొలిక్కి వచ్చింది. వివేకానంద హత్య కేసులో అనుమానితులందరూ కూడా దగ్గర వాళ్లే. కుటుంబం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేకపోయినా కూడా ఆమె ధైర్యంగా ఎదుర్కొని కోట్లు కేసులు తెలియక పోయినప్పటికీ తెలుసుకొని మరి ధైర్యంగా నిలబడింది. తన కుటుంబ సభ్యులు కూడా సునీతను ఎప్పుడు రాజకీయంగా ప్రోత్సహించలేదు. ఆమె కూడా ఎప్పుడూ కూడా రాజకీయాల వైపు ఆసక్తి చూపలేదు. వైయస్ వివేక కేసు తర్వాత ఆమెకు రాజకీయ కుట్రలు చుట్టు ముత్తాయి.

 

తండ్రిని బాధ చేసిన హంతకుల అంతు తేల్చడానికి ఆమె కంకణం కట్టుకుంటే ఆమె సొంతవారే ఆమెను నిర్వీర్యంగా చేసే ప్రయత్నాలు కూడా కొన్ని జరిగాయి. సునీతను ఎన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసిన ఆమె మాత్రం ఎటువంటి వాటికి లొంగకుండా ధైర్యంగా అన్ని పరిస్థితులను ఎదుర్కొంది. ఎమ్మెల్యే పదవి ఆశ చూపించినప్పటికీ తనకు రాజకీయాల అవసరం లేదని తన తండ్రిని చంపిన నిందితుడు ఎవరో తెలిస్తే చాలని తెలిపింది. ఏపీలో న్యాయం జరగడం లేదని సుప్రీంకోర్టు వెళ్ళింది. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలకృష్ణను సునీత కలవాలనుకుంటోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సునీత బాలయ్య బాబు ఎందుకు కలవాలి ఉంటుంది అన్న ప్రశ్న ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సునీతకు నందమూరి బాలకృష్ణ తన వంతు మద్దతు అందించారని, కేసు విషయంలో బాలయ్యకు కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్తున్నారని తెలుస్తోంది. ఇది కాకుండా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అంటూ చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -