Jagan: జగన్ ఇబ్బందులకు ఆ డీజీపీ కారణమా.. ఏం జరిగిందంటే?

Jagan: గౌతమ్ సవాంగ్ స్థానంలో డీజీపీగా నియమితుడైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ ఇంటిలిజెంట్ డిజీపీగా ఉండేవారు. ఈయన 1992 బ్యాచ్ కి చెందినవారు. 1994లో ఉమ్మడి ఆంధ్రాలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్ లో జాయిన్ అయ్యారు.

ఆ తరువాత ఏపీలోని విశాఖపట్నం నెల్లూరు జిల్లాలలో ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన సిఐడి రైల్వే విభాగాలలో కూడా ఎస్పీగా విధులు నిర్వహించడం గమనార్హం. ఉద్యోగ నిర్వహణలో రాజేంద్రనాథ్ రెడ్డి అనేక కీలకమైన కేసులను ఛేదించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు.

 

గౌతమ్ సవాంగ్ ని ఆకస్మికంగా తొలగించి రాజేంద్రనాథ్ రెడ్డి ని ఆ పోస్ట్ కి బదిలీ చేయటం అప్పట్లో పెను సంచలనం అయింది. ఆనాడు ఏరికోరి మరీ డీజీపీగా నియమించిన రాజేంద్రనాథ్ రెడ్డిని ఈనాడు ఆ పదవి నుండి తప్పించాలని చూస్తున్నారు మన సీఎం జగన్. నిజానికి రాజేంద్రనాథ్ రెడ్డి పూర్తిస్థాయి డీజీపీ కాదు. అడహక్ డిజిపినే.

 

కారణం ఏదైనాప్పటికీ డీజీపీ రేంజ్ లో ఉన్న రాజేంద్ర నాథ్ రెడ్డి సీఎం గారి ఆలోచనలకు తగినట్లుగా నడుచుకోవడం లేదని అధికార వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ రాజేంద్రనాథ్ రెడ్డి ని కాదని కొత్తవారిని ఎంపిక చేసుకుంటే డీజీపీగా చేసిన రవీంద్రనాథ్ రెడ్డి ఏమాత్రం ప్రాధాన్యతలేని మరో పోస్ట్ కి వెళ్లాల్సి ఉంటుంది.

 

ఏ పోస్ట్ కి వెళ్లినా అది ఆయన హోదాకి తగినది కాదు, ఈ విధంగా చూసుకుంటే డీజీపీ గా కాకుండా ఏ పోస్టులో చేసిన అది ఆయనకి అవమానకరమే. సంబంధమే లేని ఆదా యోజన శాఖలపై సమీక్షలో సీఎం జగన్ ఏసీబీ బిజీగా రాజేంద్రనాథ్ రెడ్డి ని తొలగించాలని స్పష్టం చేశారు. అటు డీజీపీగా ఇటు ఏసీబీ బిజీగా కూడా ఉండలేరని చెప్పుకొచ్చారు జగన్. త్వరలో ఎన్నికలు సమీపిస్తుండటంతో తనకి అనుకూలమైన వ్యక్తిని అటువంటి కీలకమైన పదవిలో పదవిలో కూర్చోబెట్టడానికి జగన్ సతవిధాల ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -