Visakha Steel: విశాఖ ఉక్కు విషయంలో జరగబోయేది అదేనా.. అసలేమైందంటే?

Visakha Steel: అదానీ గంగవరం పోర్టును బలవంతంగా కొనిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదానీ ఆ పోర్టును అడ్డం పెట్టుకొని విశాఖ స్టీల్ ప్లీల్ ప్లాంట్ పీక నొక్కాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. బొగ్గు కుత్రిమ కొరతతో కొత్త సమస్యలు సృష్టించి ఉక్కుపాదం మోపేందుకు ఆదాని వ్యూహం ఇప్పుడు విశాఖ ఉక్కు చిక్కుకుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు ఓడలు గంగవరం పోర్ట్‌లో ఉన్నాయి. అయితే స్టీల్ ప్లాంట్ నుంచి పోర్టుకు బకాయిలు రావాల్సి ఉందని, తమ పాత బకాయిలు చెల్లిస్తే తప్ప బొగ్గును ఉక్కుకు చేరనివ్వం అంటూ అడ్డుకట్ట వేశారు.

దాంతో ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీలో రోజురోజుకీ బొగ్గునిల్వలు నిండుకుంటున్నాయి. ఫలితంగా ఉక్కు ఉత్పత్తి తగ్గిపోతోంది. గంగవరం పోర్ట్‌ ఏర్పాటు కోసం 11వందల ఎకరాలు విశాఖ ఉక్కు నాటి గంగవరం పోర్ట్‌కు ఇచ్చింది. ప్రభుత్వ, ప్రవేటు భాగస్వామ్యంలో ఒక లోతైన పోర్ట్‌ ఉక్కుకు సమీపంలో ఏర్పాటు అయితే ఉక్కు ఉత్పత్తులు, ముడి సరుకు దిగుమతి ఎగుమతులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఉక్కు యాజమాన్యం భావించింది. కానీ ఇటీవల ప్రభుత్వ భాగస్వామ్యాన్ని అరకొర నిధులకు అమ్మేసుకుంది. దీంతో గంగవరం పోర్ట్‌ కాస్త ఆదాని పోర్గ్‌గా మారిపోయింది. ఆదాని పోర్ట్‌కు విశాఖ ఉక్కు కార్గో హేండ్లింగ్‌ చార్జీలు సుమారుగా 50 కోట్లు బకాయి పడింది. వీటిని చెల్లిస్తేనే బొగ్గు దిగుమతికి అనుమితిస్తామని చెబుతోంది.

 

పోర్టుకు ఇవ్వాల్సిన 50 కోట్ల విషయంలో విశాఖ ఉక్కు కూడా భిన్నమైన ఆలోచనతో ఉంది. డబ్బులు కట్టడం లేదు. దీంతో ఉక్కు దిగుమతి కావడం లేదు. ఉత్పత్తి తగ్గిపోయింది. ఇదంతా కుట్ర అని కార్మికులు మండి పడుతున్నారు. వ్యూహాత్మకంగా చేస్తున్నారని ప్రైవేటీకరణ కోసం ఆడుతున్న డ్రామా అని అంటున్నారు. ప్రజా అవసరాల కోసం అంటూ ఉక్కు భూములు గంగవరం పోర్ట్‌కిచ్చిన ఉక్కు యాజమాన్యం ఇప్పుడు పోర్ట్‌ ప్రవేటీకరణతో తమ చిక్కులు తామే తెచ్చుకున్నట్టు అయ్యింది. పోర్ట్‌ విసిరిన బకాయి వలలో చిక్కుకుని గిలగిల్లాడుతోంది. ప్రవేటీకరణకు ఉవ్విళ్లూరుతున్న కేంద్రానికి ఉత్పత్తి తగ్గింపు ఒక అస్త్రంగా పనిచేస్తుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -