Baby Producer: చిరంజీవి, అల్లు అర్జున్ మధ్య దూరం నిజమేనా.. ఆ నిర్మాత క్లారిటీ ఏంటంటే?

Baby Producer: ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో పెద్ద హిట్ సొంతం చేసుకున్నటువంటి సినిమాలలో బేబీ సినిమా ఒకటి.ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన సక్సెస్ అందుకుంది. ఇక ఈ చిత్రానికి ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈయన ఇంటర్వ్యూలకు హాజరవుతూ తనకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఎస్ కే ఎన్ మెగా ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. తాను మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి హీరోలు అందరికీ పీఆర్ గా పని చేశానని ఈయన తెలియజేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమా ఫెయిల్ కావడంతో తన వద్ద ఉన్న కొంత డబ్బులతోనే కాశీకి వెళ్లి ఇలాంటి ఫెయిల్యూర్స్ పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు రాకూడదని పూజలు చేశానని ఈయన తెలిపారు.

 

అల్లు అర్జున్ చిరంజీవి ఇద్దరు మధ్య మనస్పర్ధలు ఉన్నాయని ఇవి ఎంతవరకు నిజం అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఎస్కేఎన్ సమాధానం చెబుతూ… అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం బేబీ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ నా కట్టే కాలే వరకు తాను చిరంజీవికి అభిమానిగా ఉంటానని చెప్పారు. ఈ మాటలు బట్టి చూస్తే వారిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అనేది ఆ వాస్తవమని ఈయన తెలియజేశారు.

 

చిరంజీవి అంటే మెగా హీరోలందరికీ ఎంతో అభిమానం అని ఆ అభిమానం గుండెల్లోనే దాచుకుంటారని తెలిపారు. ఇక మెగా హీరోలకు ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే అందరూ ఒకే తాటిపైకి వస్తారని ఎస్ కే ఎన్ వెల్లడించారు . ఇక మెగా హీరోలు తమ ఫ్యామిలీ హీరోల ఫంక్షన్లకు రాకపోవడానికి కూడా కారణం ఉంది. అలా తమ హీరోల ఫంక్షన్లకు వస్తే సొంత డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుందన్న ఉద్దేశంతోనే ఫ్యామిలీ హీరోల ఫంక్షన్లకు మెగా హీరోలు రారని తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -