PM Modi: మోదీ సర్కార్ తప్పు చేస్తోందా.. ప్రజల నడ్డి విరిచే ప్లాన్ సిద్ధమైందా?

PM Modi: ప్రస్తుత రోజుల్లో జీఎస్టీ ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క విషయంలోనూ తప్పకుండా జిఎస్టి కట్టాల్సిందే. జీఎస్టీ వాతలు ఎంత వాడిగా వేడిగా ఉంటున్నాయో రోజువారీ జీవితంలో ప్రతి సందర్భంలోనూ గుర్తుకు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ఎన్నో రకాల మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించాడు. ప్రధానమంత్రి అయితే చాలు లీటరు పెట్రోల్ రూ.50 అన్న ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.100 చేయటం రవాణా ఛార్జీలు భారీగా పెంచేయటం, కేంద్రం నుంచి అందే పథకాలకు కోతలు పెట్టేయటం ధరాభారం విషయంలోనూ చేసింది తక్కువగా ఉండటం లాంటివెన్నో చోటు చేసుకున్నాయి.

ఇలా మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వదిలేసిన హామీలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చాలవన్నట్లు మరొక భారీ వాతకు మోడీ ప్రభుత్వం సిద్ధమయ్యింది. విద్యుత్ ఛార్జీల నిబంధనల్లో భారీ మార్పులు చేసింది. చూసినంతనే మేలు జరుగుతుందన్న భావన కలుగుతుంది కానీ లోతుల్లోకి వెళితే దీని తీవ్రత ఎంతన్న విషయం ఇట్టే అర్థం కావటమే కాదు. అయితే మాములుగా ఇప్పటి వరకు కరెంటును వినియోగిస్తే రోజు మొత్తం ఒకే లాంటి లెక్కలు వేసే వారు. అందుకు భిన్నంగా కొత్త విధానంలో పగలు ఛార్జీలు తక్కువగా రాత్రి వాడే ఛార్జీలు ఎక్కువగా ఉండేలా మార్పులు చేసింది.

 

మంచిదే కదా? అని చాలామంది అనుకోవచ్చు. కానీ అక్కడే ఒక పెద్ద కిటుకు ఉందండోయ్. నిజానికి ఒక ఇంట్లో పగలుతో పోలిస్తే రాత్రిళ్లే ఎక్కువగా విద్యుత్ ను వినియోగిస్తామన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ రకంగా చూస్తే పగటి వేళలో తగ్గిన విద్యుత్ చార్జీలకురాత్రిళ్లు వాయించే వాయింపునకు అంతిమంగా సామాన్యుడి జేబుకు చిల్లుపడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే పగలంతా కష్టపడి పనిచేసిన వారు రాత్రి అయ్యే సరికి ఇంట్లో ఎంచక్కా ఫ్యాన్లు ఏసీలు ఆన్ చేసుకుని పడుకుంటూ ఉంటారు.

అలాంటి వారికి ఇది నిజంగా పెద్ద షాకే అని చెప్పవచ్చు. కేంద్రం తాజాగా జారీ చేసిన విధానంలో రాత్రి వేళల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటే 20 శాతం ఛార్జీలు వడ్డిస్తారు. అదే సమయంలో పగటి వేళల్లో తక్కువ ఛార్జీల్ని వసూలు చేయనున్నారు. టైమ్ ఆఫ్ డే టారిఫ్ వ్యవస్థ పేరుతో పగటి వేలలో వాడే విద్యుత్ వినియోగదారులకు 20 శాతం మేర భారం తగ్గుతుందని చెబుతున్నారు. అదే సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉండే రాత్రి వేళ వాడే కరెంటు చార్జీల భారం ఇప్పటికంటే 10-20శాతం ఎక్కువగా ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. ఈ కొత్త విధానము వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ మాష్టారు ఓడితే ఈ కొత్త విధానంలో మార్పులు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -