Jagan: జగన్ ను జైలుకు పంపడానికి మోదీ సర్కార్ సిద్ధమైందా?

Jagan: తాజాగా భారతీయ జనతా పార్టీ నేత సత్యకుమార్‌ వాహనం పై దాడి ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసినవారిపై హత్యయత్నాంతో పాటుగా కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సత్యకుమార్‌ వాహనంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు సోము వీర్రాజు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌, వైసీపీ కార్యకర్తల పై సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సత్యకుమార్ పై వైసీపీ దాడికి పోలీసుల వైఫల్యం ప్రభుత్వం చేతకానితనమే కారణమని బిజెపి నేతలు మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు దాడికి వ్యతిరేకంగా అందులో నిర్వహించారు. వైసీపీ దౌర్జన్యాలని కేంద్రం గమనిస్తోందని కేంద్రం తలుచుకుంటే 24 గంటల్లో జగన్ జైలుకు వెళ్తారని హెచ్చరించారు.

 

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ సహా ఎస్సి నాయకుడు సురేష్ పై పథకం ప్రకారం వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని సోము వీర్రాజు ఆరోపించారు. తాజాగా పార్టీ నాయకులతో కలిసి విజయవాడలో నిరసన కార్యక్రమం మొదలుపెట్టారు. దాడికి కారణమైన వారిపై నిజమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సోము వీర్రాజు. ఈ క్రమంలోనే గుంటూరు లాడ్జి సెంటర్లో బిజెపి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన కార్యకర్తల నుంచి పోలీసులు పెట్రోల్ సీసా లాక్కున్నారు. ఈ నేపథ్యంలోనే బిజెపి కార్యకర్తల పై పెట్రోలు పడడంతో ఆగ్రహించిన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -