AP: ఏపీలో పరిస్థితి ఇంత ఘోరమా.. స్కాములు మాత్రమే మిగిలాయా?

AP: ఏపీలో అవినీతి ప్రభుత్వం ఉంది అనే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా తాజాగా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ తొమ్మిదేల్ల పాలనా విజయాల గురించి మాట్లాడారు. మోదీ విజయాల గురించి చెప్పిన తర్వాత ఏపీ ప్రభుత్వం పై ఘాటుగా విరుచుకుపడ్డారు. దేశంలోనే మోస్ట్ అవినీతి పార్టి వైసీపి‌ పార్టీ అని తేల్చి చెప్పారు. ఏపీలో జరగని అవినీతే లేదంటూ ఆయన వ్యక్తం చేశారు. మైనింగ్ స్కాం, లిక్కర్ స్కాం, ఇసుక స్కాం, ఎడ్యుకేషన్ స్కాం వైసీపి హయాంలోనే జరుగుతుందోని ఆరోపించారు.

కేంద్రం ప్రభుత్వం నిజమైన అభివృద్ధి కోసం పని చేస్తుంది. ఇటువంటి అవినీతి ప్రభుత్వంను ఎక్కడా చూడలేదని తెలిపారు. అలాగే నాలుగు ఏళ్ళుగా రాష్ట్రంలో శాంతి భధ్రతలు ఎక్కడ కనిపించలేదని, దేశంలో శాంతి‌ భధ్రతలను గాలికి వదిలేసిన రాష్ట్రం ఏపి మాత్రమేననిఇటువంటి రాష్ట్ర ప్రభుత్వంను ఎక్కడ చూడలేదంటు నిప్పులు చెలరేగారు. రాష్ట్రంలో‌ తప్పులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోదని ప్రకటించారు. వైసీపీ చేతకాని తనం జగన్ వైఫల్యం వల్ల ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని ఆరోపించారు. ఇది ఇలా ఉంటే జేపీ నడ్డా ప్రసంగంపై రాజకీయ పార్టీలన్నీ చాలా ఆసక్తిగా ఎదురు చూశాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల కారణంగా ఏ పార్టీని విమర్శిస్తారు అన్నదానిపై ఎక్కువ ఆసక్తి చూపించారు.

వైసీపీని దారుణంగా విమర్శించడంతో వైసీపీకి దగ్గరయ్యే అవకాశాలు లేవని భావిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జగన్ నిర్వహించిన భేటీలో ఎన్డీఏలో చేరుతామనిచెప్పినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు జగన్ చేరుతామన్న చేర్పించుకునే పరిస్థితిలో బీజేపీ లేదని నడ్డా స్పీచ్‌తో అర్థం అయ్యింది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ శ్రీకాళహస్తిలో జరిగిన ఈ బహిరంగ సభలో ఏపీ సీఎం పై అలాగే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై జేపీ నడ్డా కారాలు మిరియాలు నూరారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -