AP : ఏపీలో సర్పంచ్ ల పరిస్థితి ఇంత ఘోరమా.. అసలేం జరిగిందంటే?

AP : రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఉన్న పరిస్థితులు రేపు ఉంటాయని చెప్పలేము. ఎంత సొంత పార్టీ నేతలైన పార్టీ వ్యవహార శైలికారణంగా ఆగ్రహానికి కనుక గురైతే సొంత పార్టీని కూడా గద్దె దింపడానికి ఏమాత్రం వెనకాడరు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఏపీ అధికార ప్రభుత్వం వైసీపీ పార్టీ ఎదుర్కోబోతుందని తెలుస్తోంది. వైయస్సార్సీపి పార్టీ ఇంత ఘన విజయాన్ని అందుకుంది అంటే అందుకు కారణం గ్రామీణ ఓటు బ్యాంక్ అని చెప్పాలి.

 

గ్రామస్థాయిలో ప్రజలందరూ కూడా జగన్ ప్రభుత్వం వైపు నిలబడి ఆయనకు పట్టం కట్టారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి మార్పులు కారణంగా ప్రజలు అసహనానికి గురవుతున్నారు. ఇక ముఖ్యంగా గ్రామ సర్పంచుల పరిస్థితి మరి ఘోరంగా ఉంది.గ్రామాలలో అభివృద్ధి చేయాలంటే నిధులు కావాలి కానీ పంచాయతీలకు వస్తున్నటువంటి నిధులను కూడా సర్కారు వాడుకోవడంతో గ్రామస్థాయిలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి దీంతో విసుకు చెందినటువంటి సర్పంచులు ప్రభుత్వంపై వ్యతిరేక పోరాటం చేస్తున్నారు.

తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ పంచాయ‌తీరాజ్ చాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో సీపీఐ, టీడీపీ, సీపీఎం.. ఇతర పార్టీలు నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో వైసీపీ అనుబంధం సర్పంచుల సంఘం కూడా చేతులు క‌లిపింది. పంచాయ‌తీ నిధులను కూడా సర్కార్ వాడుకుంటుందని తమకు వాలంటీర్లకు ఇచ్చినటువంటి గౌరవం కూడా ఇవ్వలేదని సర్పంచులు తమ గోడు బయటపెట్టారు. వాలంటీర్లు పనిచేస్తున్నందుకు వారికి నెలకు 5000 గౌరవ వేతనం ఇస్తున్నారు.

 

వాలంటీర్లతో పోలిస్తే మాకు చాలా తక్కువగా ఇస్తున్నారని మాకు 3000 రూపాయలు ఇస్తున్నారని వారికున్న విలువ గౌరవం సర్పంచ్లకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధులు, నిధులు.. వంటివి లేకుండా పోయాయ‌ని ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఈ నేప‌థ్యంలో విప‌క్షాల‌తో చేతులు క‌లిపి.. ప్ర‌భుత్వంపై ఉద్య‌మిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు.గ్రామీణ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ తీరును తెలియజేస్తామని ప్రతిజ్ఞ చేశారు ఇదే కనుక జరిగితే వచ్చే ఎన్నికలలో జగన్ సర్కార్ ఇబ్బందులలో పడటం ఖాయమని ఈ విషయాన్ని గ్రహించి తమ వైఖరి మార్చుకుంటే వచ్చే ఎన్నికలలో మనుగడ ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -