Sharmila: షర్మిలను రెచ్చగొట్టడం వల్ల వైసీపీ ఆ రేంజ్ లో నష్టపోయే ఛాన్స్ ఉందా?

Sharmila: వైయస్ షర్మిల వైసీపీని ఎండగడుతూ ఉంటే భరించలేకపోతున్నట్లు ఉన్నారు వైసీపీ వర్గం వారు అందుకే షర్మిలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైఎస్ షర్మిల కి ఘాటు రిప్లై ఇచ్చాడు వైఎస్ఆర్ టీడీపీ మాజీ నాయకుడు కొండా రాఘవరెడ్డి. ఆమెను అహంకార పూరిత వ్యక్తిగా అభివర్ణించే రాఘవరెడ్డి అనేక షాకింగ్ విషయాలు చెప్పారు. ఈ నాటకాల వెనుక దుష్టశక్తులు ఉన్నాయన్నారు. వైయస్సార్ ను అభిమానించే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియాలి అన్నారు.

 

నిజానికి జగన్ జైలులో ఉన్న సమయంలో తల్లి విజయమ్మ చేత పాదయాత్ర చేయిద్దామని ప్రతిపాదన వస్తే అమ్మకు మోకాళ్ళ నొప్పులు అంటూ షర్మిల చెప్పిందన్నారు. ఆపై జగన్ సతీమణి భారతి చేత పాదయాత్ర చేయించాలని ఆలోచన వస్తే షర్మిల అడ్డుకట్ట వేసిందన్నారు. అన్న కోసం తాను ఉన్నానంటూ ముందుకు వచ్చిందని ఆ సమయంలోనే షర్మిల లో విష బీజాలు పడ్డాయి అన్నారు కొండా రాఘవరెడ్డి.

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రదర్ అనిల్ కుమార్ వచ్చి తనకు లాభం చేకూర్చే లా ఒక పని చేసి పెట్టమన్నాడు అని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టే ఆ పనిని చేయనంటూ విముఖత వ్యక్తం చేయడంతోనే వారిలో ఉన్న విషం ఈరకంగా బయటికి వస్తుంది అన్నారు. ఇంటిపేరు విషయంలో కూడా షర్మిల అబద్ధం చెప్తుందంటూ ఎద్దేవా చేశారు. దీనిపై షర్మిల ఘాటుగా స్పందించారు.

 

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెను అయినప్పుడు వైయస్ షర్మిల రెడ్డిని కాకుండా పోతానా.. ఏదో ఆశించి పాదయాత్ర చేశానని తనకి బాగా కావలసిన కొండ రాఘవ రెడ్డి లాంటి వాళ్లు మాట్లాడటం ఎంతో బాధగా అనిపించింది అంటూ అన్నా..కొండా అన్న మీరు ప్రమాణం చేయగలరా మీ ఆరోపణలు నిజం కాదు అని. నేను ప్రమాణం చేయగలను అన్నారు. షర్మిలను రెచ్చగొడితే వైసీపీ కే నష్టం అంటూ చెవులు కొరుక్కుంటున్నారు ఆ వర్గం వారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -