Sitara: సితారలో ఇలాంటి కోణం కూడా ఉందా.. మంచి మనస్సు చాటుకుందిగా!

Sitara: సితార ఘట్టమనేని పరిచయం అవసరం లేని పేరు మహేష్ బాబు నమ్రతల గారాల పట్టి సితార గురించి అందరికీ సుపరిచితమే అయితే సితార నేడు 11వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సితార పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక మహేష్ బాబు సైతం తన కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తనపై ప్రేమను చాటుకున్నారు. ఈ విధంగా ఘట్టమనేని వారసురాలి పుట్టినరోజు కావడంతో అభిమానులు సైతం ఈ చిన్నారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్టార్ డాటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సితార ఇప్పటికే పలు బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తూ సంపాదించడం మొదలుపెట్టారు.

 

ఇలా ఈమె ఇంత చిన్న వయసులోనే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి తరుణంలో తన పుట్టినరోజు వేడుకలను మాత్రం చాలా నిరాడంబరంగా జరుపుకున్నారు.ఇంత చిన్న వయసులోనే ఎంతో గొప్పగా ఆలోచించినటువంటి సితార పుట్టినరోజు కోసం లక్షలు ఖర్చు చేయకుండా మహేష్ బాబు ఫౌండేషన్ లో ఉన్నటువంటి వారితో కలిసి ఈమె పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

 

ఈ ఫౌండేషన్ లో ఉన్న పిల్లల సమీక్షంలో సితార కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అంతేకాకుండా ఫౌండేషన్ లోని కొంతమంది పిల్లలకు పాఠశాలకు వెళ్లడానికి సైకిల్ లను కూడా బహుమానంగా ఇచ్చారు. ఇలా ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప మనసు చాటుకున్నటువంటి సితార పట్ల అభిమానులు ఎంతో ప్రశంసలు కురిపిస్తున్నారు.పులి కడుపున పులే పుడుతుంది అన్నట్టు ఒక గొప్ప వ్యక్తి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తికి కూతురిగా సితార తన మంచితనాన్ని చాటుకుంటూ తండ్రికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -