KCR: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఒంటరి కావడం వెనుక ఇంత కథ ఉందా?

KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఎటు కానీ ధోరణిలో ఉందని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి పార్టీని గద్దెదించి తాను ఢిల్లీ పీఠం ఎక్కాలని భావించిన కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని కాస్త బిఆర్ఎస్ పార్టీగా మార్చేశారు. ఈ క్రమంలోనే బిజెపిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పలు రాష్ట్రాలలో పర్యటించారు.

ఇలా బిజెపిని ఎలాగైనా గద్దె దించాలన్న ఉద్దేశంతో కెసిఆర్ ఎన్నో ఎత్తుగడలు వేశారు. వ్యూహాలు రచించారు. అయితే ప్రస్తుతం మాత్రం కెసిఆర్ ఏ పార్టీ నేతలతోను ఈయన మాట్లాడటానికి ఇష్టపడటం లేదని తెలుస్తుంది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఈ విషయంలో ఆ పార్టీలతో కలవడం లేదు.బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి కేసీఆర్ ఆసక్తి చూపించకపోవడం వల్లనే ఇతర పార్టీలు పిలవడం మానేశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

విపక్షాల కూటమిని పటిష్టం చేయాలన్న లక్షంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా విపక్ష నేతలను కలుసుకుని చర్చిస్తున్నారు. ఆయన కేసీఆర్ ను కలవడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ కెసిఆర్ మాత్రం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలవడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. కేవలం ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలు కూడా సీఎం కేసీఆర్ ను పక్కన పెట్టాయని తెలుస్తుంది.

 

గత ఎన్నికలలో కర్ణాటకలో విజయం సాధించిన సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి కేసిఆర్ కు ఆహ్వానం అందలేదు. అదేవిధంగా స్టాలిన్ పుట్టినరోజు వేడుకలకు కూడా ఈయనకు ఆహ్వానం అందకపోవడంతో అన్ని పార్టీ నాయకులు కేసీఆర్ ను ఒంటరి చేశారని ప్రస్తుతం ఈయన ఒంటరిగా మిగిలిపోయారని పలువురు భావిస్తున్నారు.అయితే ఒకప్పుడు బిజెపిని లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున విమర్శలు కురిపించిన కేసీఆర్ ఇప్పుడు ఇలా మౌనంగా ఉండడానికి కారణం ఏంటి అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -