Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావుపై ఇంత పగబట్టారా.. అందుకే ఇలాంటి ప్రచారమా?

Kota Srinivasa Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను భయపెట్టి తన అభిమానులుగా మార్చుకున్నటువంటి వారిలో నటుడు కోట శ్రీనివాసరావు ఒకరు. ఈయన సినిమాలలో తన విలనిజంతో ఎంతోమంది ప్రేక్షకులను భయపెట్టారు.ఇలా తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్నటువంటి కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం వయసు పై పడటంతో తనకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈయన తరచూ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలెబ్రెటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.

 

ఇలా పలువురు సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి కోటా శ్రీనివాసరావుని టార్గెట్ చేస్తూ సదరు సెలబ్రిటీలు ఈయనపై తీవ్రస్థాయిలో మండిపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇకపోతే తాజాగా కోట శ్రీనివాసరావుకి సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కోట శ్రీనివాసరావు చనిపోయారంటూ ఒక వార్తను సృష్టించడంతో ఈ వార్త వైరల్ గా మారడంతో ఈ వార్తలపై నటుడు కోటా శ్రీనివాసరావు స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. అయితే ఇలా తాను చనిపోయాను అంటూ వస్తున్నటువంటి వార్తలపై ఈయన మండిపడ్డారు.

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత వయసు పైబడిన సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చనిపోయారంటూ వార్తలు సృష్టించడం సర్వసాధారణం ఇప్పటికే పలువురు సెలబ్రెటీల గురించి ఇలాంటి వార్తలు రావడంతో చివరికి వాళ్ళు మేము బ్రతికే ఉన్నామని చెప్పుకునే దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే కోటా శ్రీనివాసరావు కూడా చనిపోయారంటూ వార్తలు సృష్టించడంతో ఆయన ఒక వీడియోని విడుదల చేస్తూ తాను ఉగాది పండుగ పనులలో బిజీగా ఉండగా ఇలాంటి వార్త రావడం బాధాకరమని తెలిపారు.

 

ఈ వార్త తెలిసి అందరూ తనకు ఫోన్లు చేస్తున్నారని అలాగే పది మంది దాకా పోలీసులు తన ఇంటికి బందోబస్తు కోసం వచ్చారని ఈయన ఆవేదన చెందారు.ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలనే అనుకుంటారు కానీ ఇలాంటి తప్పుడు వార్తలను రాసి డబ్బులు సంపాదించుకోవడం తప్పు అంటూ ఈయన హెచ్చరించారు.ఇలా తన గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ నేను బ్రతికే ఉన్నానంటూ ఈయన క్లారిటీ ఇవ్వడమే కాకుండా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కోటా షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -