Kota Srinivasa Rao: నేటి హాస్యం గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కోట శ్రీనివాస్ రావు?

Kota Srinivasa Rao: అచ్చమైన హాస్యానికి స్వచ్ఛమైన చిరునామాగా పేరు తెచ్చుకున్న దర్శకుడు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఒకప్పుడు హాస్య చిత్రం తీస్తే జంధ్యాల తీయాలి అన్నంత పేరు తెచ్చుకున్న దర్శకుడు. ఎంతోమంది కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చిన దర్శకుడు జంధ్యాల. 1974లో సినీరంగ ప్రవేశం చేసిన జంధ్యాల శంకరాభరణం, సాగర సంగమం లాంటి సినిమాలకి మాటలు రాసి ముద్దమందారం సినిమాతో దర్శకుడుగా మారాడు.

అహ నా పెళ్ళంట, శ్రీవారికి ప్రేమలేఖ లాంటి ఇండస్ట్రీ హిట్లతోపాటు ఎన్నో హాస్య ప్రధాన చిత్రాలను తీసిన జంధ్యాల 2001లో హైదరాబాదులో గుండెపోటుతో మరణించడం సినీ రంగానికి తీరని లోటు. ఇప్పుడు ఈయన ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా.. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన జంధ్యాల హ్యూమర్సిటీ అవార్డుల వేడుకల భాగంగా కోట శ్రీనివాసరావుకు జంధ్యాల జీవిత సాఫల్య పురస్కారం అందించారు.

ఆ సందర్భంగా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ జంధ్యాల అందించిన కామెడీ అమ్మ పాలు లాంటివి అయితే నేడు వస్తున్న కామెడీ డబ్బా పాలు లాంటివి. జంధ్యాల అక్షరం తిని.. లక్షలు సంపాదించిన నటుడిని నేను. జంధ్యాల తరువాత హాస్యాన్ని ఆ స్థాయికి తీసుకువెళ్లిన మరొక దర్శకుడు రేలంగి నరసింహారావు అని చెప్పారు. ఆయన మాటలు నూటికి నూరుపాళ్ళు నిజం.

ఎందుకంటే ఆహనా పెళ్ళంట సినిమా లో కోట శ్రీనివాసరావుని ఒక రేంజ్ లో చూపించారు జంధ్యాల. హీరోకి పోటాపోటీగా ఉంటుంది కోట గారి క్యారెక్టర్. కోట శ్రీనివాసరావు కెరియర్ అహనా పెళ్ళంట కి ముందు ఆహనా పెళ్ళంట కి తర్వాత అనే అంతగా పేరు తీసుకు వచ్చింది ఆ చిత్రం. ఆ తర్వాత జంధ్యాల తీసిన ప్రతి సినిమాలోని కోట శ్రీనివాసరావు కనిపించేవారు.

 

ఈయన మాత్రమే కాదు ఈరోజు ఉన్న ప్రసిద్ధ కమెడియన్స్ అందరూ జంధ్యాల స్కూల్ నుంచి వచ్చిన వారే. ఏదో ఒక సందర్భంలో ఆయన చేసిన మేలు తలుచుకున్న వాళ్లే. ఇక ఇదే జంధ్యాల హోమ్ హ్యూమర్ సిటీ అవార్డులో వేడుకలో దర్శకులు అనిల్ రావిపూడి కి మారుతీలకి లీడర్స్ ఆఫ్ ది లాప్టాప్ పురస్కారాలు అందజేశారు ఆలీ గెటప్ శీను సునయనలకు మాస్టర్ ఆఫ్ స్మైల్ అవార్డులను అందించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -