Chandrababu: చంద్రబాబు గురించి ఇంత నీచ ప్రచారమా.. దారుణమంటూ?

Chandrababu: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీలు కూడా ఎన్నికలలో విజయం వైపే దృష్టి పెట్టాయి అయితే తాజాగా ఎన్నికలు హడావిడి కొనసాగుతున్న సమయంలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ అంటూ యాత్ర సినిమాకు సీక్వెల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

 

గత ఎన్నికల సమయంలో యాత్ర సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, ఈసారి యాత్ర సీక్వెల్ సినిమాగా యాత్ర 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో వైఎస్ షర్మిల పవన్ కళ్యాణ్ వంటి పాత్రలు లేకపోయినా చంద్రబాబునాయుడు పాత్రను చాలా హైలైట్ చేస్తూ చూపించారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని డిలీటెడ్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సన్నివేశాలలో చంద్రబాబునాయుడు పాత్రను చాలా నీచాతి నీచంగా చిత్రీకరించారని ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది.

చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం పై బురద చల్లేలా ఈ సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాలో వైయస్సార్ చనిపోయినప్పుడు ప్రజాధరణ చూసి కొంతమంది నాయకులు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖచ్చితం ఇప్పటికే 150 మంది ఎమ్మెల్యేలు కేంద్రానికి లేక కూడా రాసి పంపించారంటూ చెబుతారు. తండ్రి పోయాడు అనుకుంటే కొడుకు వచ్చాడని చంద్రబాబు నాయుడు డైలాగ్ చెబుతారు.

 

అధికారం కోసం తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాల సేకరణ చేస్తున్నారని శవ రాజకీయాలు చేస్తున్నాడని ప్రచారం చేయండి అంటూ చంద్రబాబు నాయుడు చెబుతారు. మనం ఈ సమయంలో బురద చల్లడం మంచిది కాదేమో అంటూ పలువురు నేతలు చప్పగా బురద చల్లడమే మా పని తుడుచుకోవడం తుడుచుకోకపోవడం వాడి పని అంటూ చంద్రబాబు డైలాగ్ చెప్పారు. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరీ ఇంత నీచంగా చంద్రబాబు నాయుడు పాత్రను చూపించాలా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -