Allu Arjun: అల్లు అర్జున్ గురించి ఈ షాకింగ్ రూమర్ నిజమేనా?

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయి పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.ఈ విధంగా ఐకాన్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నటువంటి అల్లు అర్జున్ గురించి ఒక షాకింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైనటువంటి అల్లు అర్జున్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈయన ఇప్పటివరకు ఒక సినిమాలో నటించిన హీరోయిన్ ని తిరిగి తన సినిమాలలో రిపీట్ చేయలేదు. ఇక పూజ హెగ్డే మాత్రం ఈయనతో కలిసి రెండు సినిమాలలో నటించారు. పూజా హెగ్డే మినహా అల్లు అర్జున్ మరే హీరోయిన్ ని ఇప్పటివరకు రిపీట్ చేయలేదు.

ఇలా అల్లు అర్జున్ ఎప్పుడూ కూడా కొత్త హీరోయిన్లతోనే నటిస్తూ ఉండడంతో ఈయన ఒకసారి రొమాన్స్ చేసినటువంటి హీరోయిన్లతో తిరిగి రొమాన్స్ చేయరు అంటూ అల్లు అర్జున్ గురించి ఈ విధమైనటువంటి చెత్త వార్తలను వైరల్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఈ వార్తలపై స్పందిస్తూ పూర్తిగా వీటిని ఖండించారు. అల్లు అర్జున్ సినిమాలలో కొత్తదనం కోరుకుంటారు. అందుకే హీరోయిన్లను రిపీట్ చేయరు అంటూ ఈ వార్తలను తిప్పికొడుతున్నారు.

ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫాన్స్ మధ్య కూడా కాస్త వార్ నడుస్తోంది. అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఎప్పుడు తన సినిమాలలో కొత్తదనం ఉండే విధంగా ప్లాన్ చేస్తూ అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఈయన తాజాగా పుష్ప సినిమా సీక్వెల్ చిత్రం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -