YCP-Revanth: వైసీపీకి నిధులు అందే మార్గాలను మూసేస్తున్న రేవంత్.. ప్లాన్ ఇదేనా?

YCP-Revanth: ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ అనే డైలాగ్ గట్టిగా వినిపించింది. 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ మహాకూటమిని ఏర్పాటు చేసిన పోటీచేసింది. అది కేసీఆర్ కి మండింది. అయితే, ఓ రకంగా కేసీఆర్ రెండోసారి సీఎం అవ్వడానికి అదే కారణమని చెప్పాలి. చంద్రబాబును తెలంగాణ ధ్రోహిగా చూపించి మహాకూటమిని బీఆర్ఎస్ చిత్తు చేసింది. ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. చంద్రబాబుపై రివేంజ్ తీసుకుంటానని.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మీడియా ముఖంగా ప్రకటించారు. అప్పటి నుంచి రిటర్న్ గిఫ్ట్ అనే మాట బాగా పాపులర్ అయింది. చెప్పినట్టుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రకాలుగా కేసీఆర్.. జగన్ కు సహకరించారు. నిధులు పంపించారు. అంతే కాదు.. టీడీపీకి హైద్రాబాద్ నుంచి మనీ ఫ్లో జరగకుండా కట్టడి చేశారు. దీంతో.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఐదేళ్లు తిరిగే సరికి సీన్ రివర్స్ అయింది. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు బహిరంగంగానే మద్దతిచ్చారు. దీని ప్రభావంతో ఫలితాలు అందరం చూశాం. టీడీపీ వలనే కాంగ్రెస్ గెలిచిందని చెప్పలేకపోయినా.. కాంగ్రెస్ గెలుపును టీడీపీ బలంగా కోరుకుంది. అందులో అనుమానమే లేదు.

 

ఇక, ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇవాలో, రేపో షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. మరి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అంటున్నారు టీకాంగ్రెస్ శ్రేణులు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే.. మొన్న రాజ్యసభలో సందర్భం లేకపోయినా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. బీజేపీ మొప్పు పొందడానికే ఈ మాటలు అన్నప్పటికీ.. కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు విజయసాయిరెడ్డిపై ఒంటికాలి మీద లేచారు. త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. ఆ గుణపాఠం చెప్పే రోజు రానే వస్తుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో అన్ని రకాలుగా అడ్డుకుంటారు. ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మరి అన్నింటికి సమాధానం చెప్పడానికి రేవంత్ రెడ్డి సిద్దమయ్యారనే చర్చ జరుగుతోంది.

ఏపీకి చెందిన రాజకీయ నాయకులు ఆర్థిక మూలాలు హైద్రాబాద్‌లోనే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకి చెందిన కాంట్రాక్టులు జగన్ చెప్పిన వాళ్లకే కేసీఆర్ ఇచ్చారనే టాక్ ఉంది. అంతేకాదు… తెలంగాణలోని నీటిపారుదల సబ్ కాంట్రాక్టులు ఎక్కువగా వైసీపీ నేతలే తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక, హైద్రాబాద్‌లో రాయలసీమ నేతలకు పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. ఇక, హైద్రాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వైసీపీ నేతలపై కేసులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ సమాచారం అంతా లాగుతున్నారట.

 

హైద్రాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల రిజిస్ట్రార్ల నుంచి భూములు, భవనాలు, ఆస్తుల కొనుగోళ్ల సమాచారాన్ని రేవంత్ రెడ్డి సేకరిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిథిలోనే వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల ఉన్న కేసుల వివరాలు కూడా తెప్పించుకుంటున్నారని సమాచారం. విజయసాయి రెడ్డి కామెంట్స్‌ను రేవంత్ రెడ్డి చాలా సీరియస్‌గా తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. రేవంత్ సీఎం అయిన తర్వాత ఫార్మాలిటికి కూడా జగన్ విష్ చేయలేదు. దానిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. కొడాలి కాస్త ఓవర్ గా స్పందించారు. రేవంత్ రెడ్డిని కలవాల్సిన అవసరం జగన్ కు లేదని అన్నారు. అంతేకాదు.. ఏమైనా కావాలి అనుకుంటే ఢిల్లీ వెళ్తాం.. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకుంటామని అన్నారు. ఇదికూడా రేవంత్ ని హర్ట్ చేసిందని టాక్. అన్నింటిని కలిపి సీఎం రేవంత్ రెడ్డి వైసీపీకి ఓ మంచి గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. జగన్ కనీవిని ఎరుగని గిఫ్ట్ అందుకుంటారని ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -